బ‌న్నీ… ముచ్చ‌ట‌గా మూడోసారి

2019 Latest Telugu Movie News, Rajasekhar Ankusham Completes 30 Years, Rajasekhar Ankusham Successfully Completes 30 Years, 30 Glorified Years For Rajasekhar Ankusham, Rajasekhar Ankusham Telugu Movie, Rajasekhar Latest movie News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema Latest News
Allu Arjun Follows Sankranthi Sentiment for 3rd Time

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఏస్ ఫిల్మ్ మేక‌ర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో ఓ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. పూజా హెగ్డే, నివేదా పెతురాజ్‌ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తమన్ స్వరాలు సమకూరుస్తున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌… 2020 సంక్రాంతికి విడుదల కానుంది. తాజాగా చిత్ర బృందం కూడా త‌మ సినిమా సంక్రాంతికి రాబోతున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఒక విధంగా చెప్పాలంటే… బన్నీకి సంక్రాంతి ల‌క్కీ సీజ‌న్ అనే చెప్పాలి. ఎందుకంటే… గ‌తంలో సంక్రాంతి స‌మ‌యంలో వ‌చ్చిన బ‌న్నీ రెండు చిత్రాలు కూడా బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ళ వ‌ర్షం కురిపించాయి. ఆ సినిమాలే `దేశ‌ముదురు`, `ఎవ‌డు`. బ‌న్నీ క‌థానాయ‌కుడిగా న‌టించిన‌ ‘దేశముదురు’ 2007 జనవరి 12న విడుదలై తొలి సంక్రాంతి విజయాన్ని అందివ్వ‌గా… ఆ తరువాత సరిగ్గా ఏడేళ్ళకు అంటే 2014 జనవరి 12న బ‌న్నీ అతిథి పాత్ర‌లో న‌టించిన‌ ‘ఎవడు’ విడుద‌లై బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిల‌చింది. ఈ నేప‌థ్యంలో… ముగ్గుల పండ‌గ‌ని ముచ్చ‌ట‌గా మూడోసారి టార్గెట్ చేసుకుని వ‌స్తున్న అల్లు అర్జున్‌కి… ఈ సారి కూడా ఘ‌న‌విజ‌యం ద‌క్కుతుందేమో చూడాలి.

[subscribe]

[youtube_video videoid=fCi_c7tZnC0]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.