వెబ్ సిరీస్‌లో స‌మంత‌?

2019 Latest Telugu Movie News, Actress Samantha Latest Movie News, Samantha Akkineni to feature in a Amazon Web Series, Samantha Akkineni to foray in Web Series, Samantha got an Oppertunity To act In Amazon Web Series, Samantha to Act in Amazon Web Series, Samantha To Do Web Series, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema Latest News
తాజాగా ‘ఓ బేబీ’తో మరో ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది టాలెంటెడ్ బ్యూటీ సమంత. ప్రస్తుతం… తమిళ బ్లాక్‌బ‌స్ట‌ర్‌ ‘96’ రీమేక్‌లో హీరోయిన్‌గానూ… ‘మన్మథుడు 2’లో అతిథి పాత్ర‌లోనూ న‌టిస్తోంది సామ్‌. ఈ రెండు సినిమాలు కూడా ఈ ఏడాదిలోనే థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నున్నాయి. ఇదిలా ఉంటే… ఇప్ప‌టివ‌ర‌కు సినిమాల్లోనే మురిపించిన ఈ చెన్నై సుంద‌రి… అతి త్వ‌ర‌లో ఓ వెబ్ సిరీస్‌లో ద‌ర్శ‌న‌మివ్వ‌నుంద‌ని స‌మాచారం. అంతేకాదు, అమెజాన్ ప్రైమ్ నిర్మించ‌నున్న ఈ సిరీస్‌లో సామ్ శ‌క్తిమంత‌మైన పాత్ర‌లో న‌టించ‌నుంద‌ని తెలిసింది. ప్ర‌స్తుతం ఈ మేర‌కు క‌థా చ‌ర్చ‌లు కూడా సాగుతున్నాయ‌ని అంటున్నారు. ఏదేమైనా… త్వ‌ర‌లోనే సామ్ వెబ్‌ సిరీస్ డెబ్యూపై ఫుల్ క్లారిటీ వ‌స్తుంది. కాగా, ఇప్ప‌టికే దగ్గుబాటి రానా, నవదీప్, జగపతిబాబు వంటి ప్ర‌ముఖ న‌టులు వెబ్ సిరీస్‌ల‌తో తెలుగు ప్రేక్షకులను అలరించిన నేప‌థ్యంలో… సామ్ కూడా త‌న‌దైన ముద్ర వేస్తుందేమో చూడాలి.

[subscribe]

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[youtube_video videoid=iyX8INNb9rs]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 1 =