“వద్దురా సోదరా పెళ్ళంటే నూరేళ్ళ మంటరా”… అంటూ పెళ్లి విషయంలోనూ, అమ్మాయిల విషయంలోనూ తనదైన శైలిలో జాగ్రత్తలు చెప్పిన ‘మన్మథుడు’ అభిరామ్‌ను తెలుగు ప్రేక్షకులు అంత తేలిగ్గా మరచిపోలేరు. ఇప్పుడు ఆ క్లాసిక్ ఎంటర్‌టైనర్‌కి కొనసాగింపుగా మరో కొత్త కాన్సెప్ట్‌తో తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి వస్తున్నాడు ‘మన్మథుడు 2’.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కింగ్ నాగార్జున, స్టన్నింగ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ జంటగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో సమంత, కీర్తి సురేష్ అతిథులుగా కనిపించనున్నారు. లక్ష్మి, రావు రమేష్, ‘వెన్నెల’ కిషోర్ ఇతర ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో… ఇప్పుడు ముఖ్య పాత్రల పరిచయానికి రంగం సిద్ధం చేసింది చిత్ర బృందం. ఇప్పటికే విడుదలైన టీజర్ ద్వారా చిత్ర కథానాయకుడు నాగ్ పాత్రను పరిచయం చేసిన చిత్ర యూనిట్… ఇప్పుడు హీరోయిన్ రకుల్ పోషిస్తున్న అవంతిక పాత్ర తాలూకు ఫస్ట్ లుక్‌ను రేపు అంటే జూలై 9న ఉదయం 9 గం.లకి విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ను… నాగార్జున, పి.కిరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా… ఆగస్టు 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందీ చిత్రం.
[youtube_video videoid=wpwLqNBxb-Y]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: