10 ఏళ్ళ త‌రువాత `రెచ్చిపో`జోడీ?

2019 Latest Telugu Movie News, Nithiin And Ileana To Reunite After 10 Years, Rechipo Combo to Repeat Again After 10Years, Nithiin and Ileana Combo again After Long Time, Nithiin and Ileana Combo, Nithiin and Actress Ileana Combo Again,Nithiin and Ileana Combo Repeats Again, Telugu Filmnagar, Telugu Film News 2019, Tollywood Cinema Updates, Actor Nithiin Latest Movie News
Nithiin And Ileana To Reunite After 10 Years

యువ కథానాయకుడు నితిన్, టాలెంటెడ్ డైరెక్ట‌ర్ చంద్రశేఖర్ యేలేటి కాంబినేష‌న్‌లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రం… ఇటీవ‌లే పూజా కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంది. త్వ‌ర‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది. కాగా, ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌లో ముగ్గురు కథానాయికలకు స్థాన‌మున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఇద్దరు నాయికలుగా రకుల్ ప్రీత్ సింగ్, ప్రియాప్రకాష్ వారియర్‌ను ఎంపిక చేసిన చిత్ర బృందం… కీలకమైన మరో హీరోయిన్ పాత్ర కోసం క‌థానాయిక అన్వేష‌ణ‌లో ఉంద‌ని సమాచారం. తాజా స‌మాచారం ప్ర‌కారం… ఇప్పుడు ఆ పాత్ర కోసం టాలెంటెడ్ బ్యూటీ ఇలియానాను ఎంపిక చేశార‌ని తెలిసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆస‌క్తిక‌ర‌మైన విష‌యమేమిటంటే… 10 ఏళ్ళ క్రితం నితిన్, ఇలియానా క‌ల‌యిక‌లో ‘రెచ్చిపో’ (2009) అనే చిత్రం వచ్చింది. మళ్ళీ ఇంతకాలానికి ఈ కాంబినేషన్ వెండితెరపై సందడి చేయనుండడం విశేష‌మనే చెప్పాలి. ఇటీవల ‘అమర్ అక్బర్ ఆంటోనీ’తో తెలుగులో రీ-ఎంట్రీ ఇచ్చిన ఇలియానాకి ఆ సినిమా ఆశించిన‌ విజయం అందించ‌లేదు. మరి నితిన్ మూవీతోనైనా ఈ అందాల తార‌కు పూర్వ‌వైభవం ద‌క్కుతుందేమో చూడాలి. కాగా… త్వ‌ర‌లోనే ఇలియానా ఎంట్రీపై క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉంది.

[subscribe]

[youtube_video videoid=QIam1ccIb6c]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + 7 =