ఇటీవలే ‘118’ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన కళ్యాణ్ రామ్.. నూతన దర్శకుడు మల్లిడి వశిష్టతో ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం స్క్రిప్ట్ ఫైనల్ స్టేజ్ లో ఉంది. ఇక ఈ సినిమాకి ‘తుగ్లక్’ అనే టైటిల్ ను అనుకున్నట్టు గతంలో వార్తలు వచ్చిన సంగతి కూడా విదితమే. అయితే ఇప్పుడు ఆ టైటిల్ ను మార్చనున్నట్టు తెలుస్తోంది. తుగ్లక్ అనే టైటిల్ అంత క్యాచీగా లేదని… పెద్దగా రీచ్ అవ్వదని భావించి ‘రావణ’ అనే టైటిల్ ను మార్చనున్నారట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన ఇవ్వనున్నారట చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా కళ్యాణ్ రామ్ సొంత బ్యానర్ ఎన్ టి ఆర్ ఆర్ట్స్ నిర్మించనున్న ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ ద్విపాత్రిభినయం చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో మిగిలిన నటీనటులను ఇంకా ఎంపిక చేయలేదు. త్వరలోనే నటీనటులను .. సాంకేతిక నిపుణుల ఎంపికను పూర్తిచేసుకుని సెట్స్ పైకి వెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఇక ఈసినిమాతో పాటు ఆయన సతీశ్ వేగేశ్నతో కలిసి సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలో కళ్యాణ్ సరసన మెహ్రీన్ హీరోయిన్ గా నటించనుంది. త్వరలోనే ఈ సినిమా కూడా సెట్స్ పైకి వెళ్లనుంది.
[subscribe]
[youtube_video videoid=5WbPq3qjJHE]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: