ఇస్మార్ట్ శంకర్ షూటింగ్ ఫూర్తి – మారిన రిలీజ్ డేట్

Ismart Shankar Movie Release Date Confirmed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Ismart Shankar Movie Updates,Ismart Shankar Telugu Movie Latest News,Ismart Shankar Movie Release Date Confirmed,Ismart Shankar Telugu Movie Release Date Fixed
Ismart Shankar Movie Release Date Confirmed

ఎనర్జిటిక్ స్టార్ రామ్ , పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఇస్మార్ట్ శంకర్. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ తాజాగా పూర్తయి… పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. తాజాగా సినిమా రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు. నిజానికి ఈ సినిమాను జులై 12వ తేదీన రిలీజ్ చేయాలనుకున్నారు కానీ.. కొన్ని కారణాలవల్ల జులై 18వ తేదీకి వాయిదా పడింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ కు మంచి రెస్పాన్సే వచ్చింది. ఇక మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీత సారథ్యంలో విడుద‌లైన నాలుగు పాట‌ల‌కు ఇప్పటికే అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది. దీంతో సినిమా పై భారీ అంచ‌నాలు ఏర్పడ్డాయి.

కాగా యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీ లో నిధి అగర్వాల్, నభా నటేష్ కథానాయికలు. ఈ సినిమాను పూరీ టూరింగ్ టాకీస్ పతాకం ఫై పూరి జగన్నాథ్ , ఛార్మి కలిసి నిర్మిస్తుండగా… ఈ సినిమాకి ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ రాజ్ తోట సినిమాటోగ్రఫీని అందించనున్నారు. . కొత్త లుక్ తో .. కొత్త బాడీ లాంగ్వేజ్ తో .. డిఫరెంట్ డైలాగ్ డెలివరీతో రామ్ ఈ సినిమాలో కనిపించనున్నాడు. ఇక పూరి జగన్నాథ్, రామ్ కాంబినేషన్ లో ఫస్ట్ టైమ్ రూపొందుతున్న ఇస్మార్ట్ శంకర్ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. మరి చూద్దాం ఈ సినిమాతో వీరిద్దరికీ సక్సెస్ అందుతుందేమో..

[subscribe]

[youtube_video videoid=nrQgHxNKrcQ]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.