సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ అండ్ బడ్జెట్ సినిమా సాహో. ప్రస్తుతం మూవీ సాంగ్స్ చిత్రీకరణ జరుపుకుంటుంది. ఆస్ట్రియా లో ఆల్ప్స్ పర్వత శ్రేణి వద్ద ఉన్న టైరోల్ స్టేట్ లో షూటింగ్ ను జరుపుకుంటుంది. అయితే పాట షూట్ కూడా ఏదో నార్మల్ గా కాకుండా 1368 అడుగుల ఎత్తులో షూట్ చేస్తున్నారట. దీనికోసం కేబుల్ కార్స్ తీసుకెళ్లడం జరిగిందట. అయితే అంత ఎత్తులో షూట్ జరుగుతున్నప్పుడు యూనిట్ అంతా కంగారుపడకుండా హీరో ప్రభాస్ అందర్ని సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేశారట.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమాను ఆగష్ట్ 15న రిలీజ్ చేయనున్న నేపథ్యంలో అప్పుడే ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ప్రారంభించేశారు. దీనిలో భాగంగానే ఇటీవలే టీజర్ ను కూడా రిలీజ్ చేశారు. ఇక టీజర్ కు ఎంత రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీంత సినిమాపై అంచనాలు ఇంకా పెరిగిపోయాయి.
ఇంకా ఈ సినిమాలో ప్రభాస్ సరసన శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా..ఇంకా నీల్ నితిన్, జాకీ ష్రాఫ్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, అరుణ్ విజయ్, మందిరా బేడీ ఇలా పులువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యువీ క్రియేషన్స్ అధినేతలు వంశీ-ప్రమోద్ అత్యంత భారీ బడ్జెట్ తో ఏక కాలంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
బ్యానర్ – యువి క్రియేషన్స్
దర్శకుడు – సుజీత్
నిర్మాతలు – వంశీ-ప్రమోద్-విక్కీ
సినిమాటోగ్రాఫర్ – మధి
ఆర్ట్ డైరెక్టర్ – సాబు సిరీల్
ఎడిటర్ – శ్రీకర్ ప్రసాద్
[youtube_video videoid=rDoFiOjoC2Y]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: