‘రణరంగం’ సర్ ప్రైజింగ్ అప్ డేట్

Ranarangam Movie Team To Surprise With Teaser Update

సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా రణరంగం అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ కు కాస్త బ్రేక్ పడింది. షూటింగ్ సమయంలో శర్వానంద్ భుజానికి గాయమవడంతో ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. దీంతో శర్వానంద్ దాదాపు రెండు నెలల వరకూ విశ్రాంతి తీసుకోవాల్సి ఉంది. ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ సినిమా నుండి సర్ ప్రైజ్ ఇవ్వడానికి సిద్దమైంది చిత్రయూనిట్. సితార ఎంటర్ టైన్మెంట్ తన అఫీషియల్ ట్విట్టర్ ఖాతా ద్వారా టీజర్ రిలీజ్ డేట్ నుతెలిపారు. రేపు సాయంత్రం 4.05 నిమిషాలకు ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

 

కాగా ఈసినిమాలో కాజల్, ప్రియదర్శి ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌ టైన్మెంట్స్‌ పతాకంపై యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి మాటలు : అర్జున్‌ – కార్తీక్‌, సంగీతం : ప్రశాంత్‌ పిళ్ళై , ఛాయాగ్రహణం : దివాకర్‌ మణి, ఎడిటర్‌ : నవీన్‌ నూలి, పాటలు : రామజోగయ్య శాస్త్రి, కృష్ణ చైతన్య, పోరాటాలు :వెంకట్‌, నృత్యాలు: బృంద, శోభి, శేఖర్‌, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌ : సి.హెచ్‌.రామకృష్ణ రెడ్డి.

[subscribe]

[youtube_video videoid= t25tZc8vk7g]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + one =