బ్లాక్ బస్టర్ మూవీ ఫిదా తరువాత నేషనల్ అవార్డ్ గ్రహీత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సూపర్ హిట్ మజిలీ మూవీ తో మంచి ఫామ్ లో ఉన్న హీరో నాగచైతన్య, ఫిదా మూవీ తో ప్రేక్షకులను ఫిదా చేసిన నేచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా ఒక అందమైన ప్రేమకథ రూపొందనుంది. అనేక సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసిన ఏషియన్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ మూవీ తో నిర్మాణ రంగం లోకి అడుగుపెడుతున్నారు. రాందాస్ నారంగ్, FDC ఛైర్మన్ రామ్మోహనరావు, అమిగో క్రియేషన్స్ ఈ మూవీ ని నిర్మిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
#NC 20 మూవీ గా తెరకెక్కుతున్న ఈ మూవీ సికిందరాబాద్ గణేష్ టెంపుల్ లో ఈ రోజు పూజా కార్యక్రమం జరుపుకుంది. రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో ప్రారంభించి, డిసెంబర్ నెలలో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. ఈ మూవీ స్టోరీ ఇంప్రెసివ్ గా ఉండటం తో హీరో , హీరోయిన్స్ బల్క్ గా డేట్స్ కేటాయించారని సమాచారం. 60, 70 రోజులలో షూటింగ్ కంప్లీట్ అయ్యేలా నిర్మాతలు ప్లాన్ చేశారు. శేఖర్ కమ్ముల , నాగచైతన్య, సాయి పల్లవి వంటి క్రేజీ కాంబినేషన్ లో రూపొందనున్న #NC 20 మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: