ఆమె అస్తమయంతో కృష్ణ పక్ష తిమిరంలోకి కృష్ణ జీవితం

#RIPVijayaNirmalaGaru, Telugu FilmNagar Tribute To Vijaya Nirmala Garu,Vijaya Nirmala passes away,Superstar Krishna Wife Vijaya Nirmala demise, Veteran Actress Vijaya Nirmala Passes Away,Vijaya Nirmala movies,Vijaya Nirmala passes away at 75,2019 Latest Telugu Movies News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates
Telugu FilmNagar Tribute To Vijaya Nirmala Garu
స్వభావరీత్యా పురుషాధిక్య లక్షణం కలిగిన చిత్ర పరిశ్రమలో మహిళా విజయానికి, మహిళా వికాసానికి, మహిళా గళానికి రిప్రజెంటింగ్ పర్సనాలిటీగా ఎదిగిన అసామాన్య వ్యక్తిత్వ మూర్తి శ్రీమతి విజయనిర్మల. ప్రతిభ, పట్టుదల, కార్యదక్షత, నాయకత్వ లక్షణాలలో తన భర్త సూపర్ స్టార్ కృష్ణకు ఏ మాత్రం తీసిపోని సమర్థత విజయనిర్మల సొంతం. తెలుగు, తమిళ, మళయాల రంగాలలో కొద్ది రోజుల తేడాతో హీరోయిన్ గా పరిచయమై మూడు రంగాలలో తొలి చిత్రంతోనే విజయాలు సాధించి హ్యాట్రిక్ హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన వన్ అండ్ ఓన్లీ హీరోయిన్ విజయనిర్మల. అలాగే దర్శకురాలిగా ముందు మలయాళంలో తొలి ప్రయత్నం చేసి విజయాన్ని అందుకుని తెలుగులో మీనా చిత్రం ద్వారా తొలి అడుగు వేసి ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలందుకున్న విజయనిర్మల 44 చిత్రాల దర్శకురాలిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానాన్ని సంపాదించుకోవటం మహిళా కేవలం లోకానికే కాదు … తెలుగువారందరికీ గర్వకారణం. ఇక నిజ జీవిత నాయికా నాయకులుగా, తెర జీవిత నాయికా నాయకులుగా కృష్ణ- విజయనిర్మలల సుదీర్ఘ అనుబంధ స్రవంతి గురించి ఎంత చెప్పినా తక్కువే. ‘సాక్షి’ చిత్రం షూటింగ్ సమయంలో ఏర్పడిన అనుబంధం వీరి పెళ్లికి దారితీసింది. వివాహం విద్యా నాశనం వివాహం వృత్తి నాశనం – అన్న సామెతలు అందరి విషయంలో నిజం కాదు అని నిరూపిస్తూ పెళ్లి చేసుకున్న తరువాత 43 చిత్రాలలో కలిసి నటించిన ఏకైక జంటగా వరల్డ్ రికార్డు సృష్టించారు కృష్ణ విజయనిర్మల. ఇక సూపర్ స్టార్ కృష్ణ జీవితంలోని ప్రతి నిర్ణయాన్ని, ప్రతి కదలికను, ప్రతి ఘట్టాన్ని విజయనిర్మల ఎలా డ్రైవ్ చేసేవారో అందరికీ తెలుసు. ఒక సమర్థవంతురాలైన భార్య భర్త నిర్ణయాలను అమలుపరచడంలో “కరణేషు మంత్రి”- అన్నట్లుగా విజయనిర్మల కృష్ణకు గొప్ప భరోసాగా నిలిచేవారు. విజయనిర్మల ఉంది… అన్నీ తనే చూసుకుంటుంది… అనే డిపెండెన్సీయే కృష్ణ ఆరోగ్య రహస్యం అని అందరూ అనుకోవటం వారి ఆదర్శ, అన్యోన్య దాంపత్యానికి నిదర్శనం. విజయనిర్మల లేని కృష్ణ గారిని ఊహించుకోవటం కష్టం అంటూ కంటతడి పెట్టుకుంటున్నారు పరిశ్రమ ప్రముఖులు, అభిమానులు. నిజానికి “ఎవరికి ఎవరు చివరికి ఎవరు ముగియని ఈ యాత్ర లోనా ముగిసే ఈ జన్మలోనా ” అన్న కవి వాక్యంలోని వైరాగ్య, నైరాశ్య భావాలు గుండెను బరువెక్కించే సందర్భం ఇది. నిజంగా విజయనిర్మల లేని కృష్ణ జీవితాన్ని కృష్ణ పక్ష తిమిరం కమ్మేసినట్లే . ఆమె నిష్క్రమణ ఒక్క కృష్ణ జీవితంలోనే కాదు… ఆమె ఔన్నత్య, ఔదార్యాల మీద ఆధారపడిన ఎంతోమంది బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, అభిమానులు అందరూ దిక్కుతోచని వారైపోయారు. ఎందుకంటే ఎందరినో నడిపించిన “ఆమే ఒక సైన్యం”. నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా, గృహిణిగా, అందరినీ కలుపుకుపోయే నాయకత్వ లక్షణాల ధీర వనితగా, అన్నింటినీ మించి అందరి కష్టసుఖాల్లో పాలుపంచుకునే దాతృత్వ, మాతృత్వ మూర్తిగా “విజయనిర్మల” ఒక పరిపూర్ణ మహిళ. ఆమె నిష్క్రమణ ఒక తీరని లోటు. సుదీర్ఘ సినీ జీవితంలోని ప్రతి ఘట్టంలోనూ విజయపరంపరను కొనసాగించి నిష్క్రమించిన విజయనిర్మల ఆత్మ శాంతిని ఆకాంక్షిస్తోంది “దతెలుగు ఫిలిం నగర్ డాట్ కం”.

[subscribe]

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[youtube_video videoid=UXvnawXp3SY]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + fourteen =