హాలీవుడ్ లో రూపొందే జేమ్స్ బాండ్ మూవీస్ కు భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకాదరణ ఉంది. బెంగాలీ సాహిత్యం లో డిటెక్టివ్ సాహిత్యం ఒక వెలుగు వెలిగింది. కొవ్వలి, టెంపోరావ్, కొమ్మూరి సాంబశివరావు, మధు బాబు ల తెలుగు డిటెక్టివ్ సాహిత్యం కుర్రకారును ఒక ఊపు ఊపింది. డిటెక్టివ్ నవలలోని డిటెక్టివ్ వాలి, యుగంధర్, షాడో , బుల్లెట్ పాత్రలు ప్రేక్షకాదరణ పొందాయి. బెంగాలీ డిటెక్టివ్ సాహిత్యానికి ప్రభావితుడైన నిర్మాత చక్రపాణి మిస్సమ్మ మూవీ లో ANR ను లోకల్ డిటెక్టివ్ పాత్రలో నటింపజేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరో కృష్ణ నటించిన గూఢచారి 116 ఘనవిజయం సాధించి, తొలి తెలుగు జేమ్స్ బాండ్ మూవీ గా ప్రేక్షకుల ప్రశంసలు పొందింది. హీరో కృష్ణ నటించిన ఏజెంట్ గోపి, రహస్యగూఢచారి, చిరంజీవి నటించిన గూఢచారి నెం 1 మూవీస్ ప్రేక్షకాదరణ పొందలేదు. చిరంజీవి నటించిన చంటబ్బాయ్ కామెడీ గా సాగింది. తరువాత మోహన్ బాబు డిటెక్టివ్ నారద మూవీ లో నటించారు. చాలా కాలం డిటెక్టివ్ పాత్రను
చిత్ర పరిశ్రమ పట్టించుకోలేదు.
మిస్కిన్ దర్శకత్వంలో విశాల్ హీరోగా నటించిన తమిళ మూవీ డిటెక్టివ్ ఘనవిజయం సాధించింది. తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా సక్సెస్ అయింది. అడివి శేష్ నటించిన గూఢచారి సూపర్ హిట్ అయింది. కొత్త హీరో డిటెక్టివ్ గా నటించిన సాయి శ్రీనివాస ఆత్రేయ మూవీ విజయం సాధించింది. సీనియర్ హీరో రాజశేఖర్ డిటెక్టివ్ గా నటించిన కల్కి మూవీ జూన్ 28 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ పై ప్రేక్షకులకు భారీ అంచనాలు ఉన్నాయి. ఇక పై తెలుగు చిత్ర పరిశ్రమ డిటెక్టివ్ చిత్రాలకు స్వాగతం పలికే అవకాశం ఉంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: