ఆనంది ఆర్ట్ క్రియేషన్స్… ‘అంతఃపురం’(1998) చిత్రంతో సినీ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన ఈ సంస్థ… తొలి చిత్రంతోనే ఫిలింఫేర్‌ను సొంతం చేసుకుంది. అనంతరం ‘నువ్వు నేను’, ‘ఔను..వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు!’(సమర్పణ), ‘ఒకరికి ఒకరు’, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’, ‘మజ్ను’ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించి… నిర్మాణ రంగంలో మంచి అభిరుచి గల సంస్థగా టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… ప్రస్తుతం ‘కింగ్’ నాగార్జున, స్టన్నింగ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ జంటగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మన్మథుడు 2’ చిత్రాన్ని మనం ఎంటర్‌ప్రైజెస్, వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ సంస్థలతో కలసి ఈ సంస్థ నిర్మిస్తోంది. ఆగస్టు 9న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే… ఈ సంస్థకి, ఆగస్టు నెలకి మంచి అనుబంధమే ఉంది. ఎందుకంటే… 2001లో ఈ సంస్థ నిర్మించిన ‘నువ్వు నేను’ ఆగస్టు 10న విడుదల కాగా, ఆ తదుపరి సంవత్సరం అంటే 2002లో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సమర్పణలో వచ్చిన ‘ఔను..వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు!’ ఆగస్టు 2న రిలీజైంది. అంటే… ఆగస్టు ఫస్ట్ హాఫ్‌లో విడుదలైన ఆ రెండు సినిమాలు కూడా అటు మ్యూజికల్ పరంగాను, ఇటు సినిమా పరంగాను ప్రేక్షకులను అలరించాయి. ఈ నేపథ్యంలో… ఇప్పుడు బాగా కలిసొచ్చిన ఆగస్టు ఫస్ట్ హాఫ్‌లోనే విడుదల కానున్న ‘మన్మథుడు 2’తో… ఈ సంస్థ హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంటుందేమో చూడాలి.
[youtube_video videoid=j7B34XDQ3Bo]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: