‘జై సింహా’ తరువాత నటసింహ నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కె.ఎస్.రవికుమార్, నిర్మాత సి.కళ్యాణ్, సంగీత దర్శకుడు చిరంతన్ భట్ కాంబినేషన్‌లో మరో చిత్రం రాబోతున్న విషయం తెలిసిందే. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ సినిమాలో బాలయ్య పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా దర్శనమివ్వనున్నాడు. అలాగే… ఈ చిత్రానికి ‘రూలర్’, ‘క్రాంతి’ అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే… ఈ సినిమాలో బాలయ్య పాత్రకు సంబంధించి కొన్ని మార్పు చేర్పులు చేసినట్టు ఈ మధ్య పలు కథనాలు వచ్చాయి. కానీ ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని తెలిసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
బాలయ్య పాత్రకు సంబంధించి ఎటువంటి మార్పులు చేయలేదనీ, కాకపోతే… బాలయ్య ఇచ్చిన సలహా మేరకు మిగిలిన పాత్రలతో పాటు మొదట అనుకున్న కథలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని డైరెక్టర్ అండ్ టీం కొన్ని మార్పుచేర్పులు చేసినట్లు టాక్. అంతేకాదు… బాలకృష్ణ పాత్రతో పాటు ఆయన మార్కు డైలాగ్స్, మేనరిజమ్స్ ఈ చిత్రంలో హైలైట్‌గా నిలవనున్నాయని తెలిసింది.
జూలై నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్… 2020 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
[youtube_video videoid=KaLq0KcfeRs]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: