సంపూ సినిమాకు విముక్తి రిలీజ్ డేట్ ఫిక్స్

2019 Latest Telugu Movie News, Sampoornesh Babu Kobbari Matta Movie Gets A Release Date, Kobbari Matta Teaser Release Date Locked, Kobbari Matta Movie Latest News, Kobbari Matta Movie Teaser Release Date Fixed, Kobbari Matta Movie Teaser Release Date Revealed,Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Kobbari Matta Teaser Release Date Announced, Kobbari Matta Teaser Gets a Release Date
Sampoornesh Babu Kobbari Matta Movie Gets A Release Date

“హృదయ కాలేయం” అనే ఒక్క మూవీతో టాలీవుడ్ లో ఒక్కసారిగా టాక్ ఆఫ్ ద టౌన్ అయి.. ఆ తరువాత పలు అవకాశాలను అందిపుచ్చుకున్న నటుడు సంపూర్ణేష్ బాబు. తెలుగు ప్రేక్షకులు ముద్దుగా సంపూ అని పిలుచుకుంటూ ఉంటారు. హీరో కు కావాల్సిన ఫిజిక్, బాండీ లాంగ్వేజ్ లేకపోయినా కూడా… తన సీరియస్ నటనతోనే అందరినీ కడుపుబ్బా నవ్వించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. హాయిగా నవ్వుకోడానికైనా సంపూ సినిమాకు వెళతారు ప్రేక్షకులు. ‘హృదయ కాలేయం’ తరువాత ‘సింగం 123’ విడుదల చేసిన సంపూ.. ఆతరువాత పలు సినిమాల్లో కమెడియన్, అతిథి పాత్రల్లో కూడా కనిపించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక హీరోగా ఆయన ‘కొబ్బరి మట్ట’ అనే సినిమాను కూడా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈసినిమా నుండి టీజర్, పాటలను ఎప్పుడో రిలీజ్ చేసి హడావుడి చేశారు. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ.. ఇంతవరకూ రిలీజ్ కు నోచుకోలేదు. ఇప్పుడు తాజాగా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసి షాకిచ్చారు. ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రొడ్యూసర్ రాజేష్ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. జులై19వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

కాగా మనోహర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఇషికా సింగ్, షకీలా, కత్తి మహేష్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. మరి ఈ సినిమా ఎంత వరకూ సక్సెస్ అవుతుందో చూద్దాం..

[subscribe]

[youtube_video videoid=6B88cBVdt4A]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + ten =