ప్రస్తుతం డిజిటల్ మీడియా హవా నడుస్తుందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్ని కోట్లు పెట్టి సినిమా తీస్తున్నా.. నెల, రెండు నెలల్లో ఏదో ఒక యాప్ లో దర్శనమిస్తూనే ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే సినిమా కంటే వెబ్ సిరీస్ లకు మంచి బిజినెస్ నడుస్తుందని చెప్పొచ్చు. అందుకే ప్రతి ఒక్కరూ వెబ్ సిరీస్ లపైనే దృష్టి పెడుతున్నారు. ఆఖరికి సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా తన సొంత ప్రొడక్షన్ ద్వారా వెబ్ సిరీస్ లు తీయాలని చూస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు ఈ జాబితాలోకి మరో డైరెక్టర్ చేరిపోయినట్టు తెలుస్తోంది. ఆయనేవరో కాదు.. క్రిష్. నిజ జీవితానికి దగ్గరగా.. వైవిధ్యమైన కథలను తెరకెక్కించడంలో డైరెక్టర్ క్రిష్ స్టైలే వేరు. అందుకు గమ్యం, వేదం లాంటి సినిమాలే ఉదాహరణ. ఇక ఇటీవలే ఎన్టీఆర్ బయోపిక్ గా ‘కథానాయకుడు’ .. ‘మహానాయకుడు’ సినిమాలను తెరకెక్కించాడు. అయితే ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సరిగా ఆడకపోవడంతో క్రిష్ తన తరువాత ప్రాజెక్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా… ఇప్పుడు మరో వార్త వినిపిస్తుంది. ప్రస్తుతం క్రిష్ వెబ్ సిరీస్ తీసే ఆలోచనలో ఉన్నాడని…తన సొంత బ్యానర్లో ఆయన వెబ్ సిరీస్ ను ప్లాన్ చేసాడని అంటున్నారు. దానికి సంబంధించిన కథ .. స్క్రీన్ ప్లే – మాటలను పూర్తి చేశారని సమాచారం. అయితే డైరెక్షన్ బాధ్యతలు క్రిష్ తీసుకుంటారా..? లేక వేరే ఎవరికైనా ఇస్తారా అన్నది తెలియాల్సి ఉంది. దీనితో పాటు పలు కథలను క్రిష్ ఫైనలైజ్ చేయాల్సి ఉన్నట్టు తెలుస్తోంది.
[youtube_video videoid=J5tZKVjUb-k]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: