‘ఆర్ఆర్ఆర్’ ఫస్ట్ లుక్ రిలీజ్ ఆరోజేనా?

RRR First Look Gets A Release Date,Telugu Filmnagar,Telugu Film Updates,2019 Latest Telugu Movie News,Tollywood Cinema News,RRR First Look Release Date,RRR First Look Release Date Locked,RRR First Look Release Date Fixed,RRR First Look Release Date Revealed,RRR First Look Release Date Announced,RRR Movie Latest Updates
RRR First Look Gets A Release Date

బాహుబలి సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న సినిమా… అది కూడా ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలు చేస్తుండటంతో ‘ఆర్ఆర్ఆర్’ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూడాలా అని ఆతృతగా ఉన్నారు తెలుగు ప్రేక్షకులు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. అంతేకాదు… ఇంకా సినిమా నిర్మాణం కూడా పూర్తి కాక‌ముందే ఈ సినిమా ఓవ‌ర్‌సీస్ రైట్స్ భారీగా అమ్ముడుపోయినట్టు వార్తలు వస్తున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పుడు తాజాగా మరో వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను స్వతంత్య్ర దినోత్సవం ఆగష్ట్ 15వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి దీనిపై క్లారిటీ రావాలంటే అధికారికంగా ప్రకటన వచ్చేంత వరకూ ఆగాల్సిందే. ఇక ఇదే రోజు సాహో సినిమా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.

భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈసినిమాను ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమురం భీం పాత్ర పోషిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు రోల్ లో నటిస్తున్నాడు. చెర్రీ సరసన ఆలియా భట్ హీరోయిన్ గా సెలెక్ట్ అయింది. ఎన్టీఆర్ హీరోయిన్ కోసం చిత్రయూనిట్ అన్వేషణలో ఉంది. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి వ‌చ్చే ఏడాది జూలై 30న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయనున్నారు.

[subscribe]

[youtube_video videoid=0XwacVaiMO0]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × one =