హీరోయిన్ ఓరియెంటెడ్ ఫిల్మ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలచిన కథానాయిక అనుష్క. `అరుంధతి`, `భాగమతి`తో ఘనవిజయాలను అందుకున్న స్వీటీ… ఇప్పుడు మరో ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్‌లో నటిస్తోంది. అదే `నిశ్శబ్దం`. బహు భాషా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా ఇతర భాషల్లో `సైలెన్స్` పేరుతో రిలీజ్ కానుంది. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం… ఇటీవలే అమెరికాలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకుంది. కాగా, అప్పుడే 25 శాతం చిత్రీకరణ పూర్తిచేసుకుందీ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీ. ఈ విషయాన్ని దర్శకుడు హేమంత్… తన ట్విట్టర్ ఖాతాలో తెలియజేశాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
హై టెక్నీకల్ వాల్యూస్‌తో రూపొందుతున్న `నిశ్శబ్దం` 25 శాతం చిత్రీకరణ పూర్తిచేసుకుందని… ఈ సందర్భంగా అనుష్క, అంజలి, సుబ్బరాజు, అవసరాల శ్రీనివాస్, కోన వెంకట్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వివేక్ కూఛిబొట్లకి కృతజ్ఞతలు తెలిపాడు హేమంత్. యునైటెడ్ స్టేట్స్‌లో సీట్టెల్‌లో షూట్ జరుపుకుంటున్న ఈ సినిమాలో మాధవన్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. త్వరలోనే మాధవన్ కూడా టీమ్‌లో జాయిన్ కాబోతున్నట్లు హేమంత్ ఈ సందర్భంగా తెలియజేశాడు.
[youtube_video videoid=NK_jtSSt7BY]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: