‘మెంటల్ మదిలో’తో టాలీవుడ్‌కు కథానాయికగా పరిచయమైంది నివేదా పేతురాజ్. ఇటీవల సాయి తేజ్ హీరోగా నటించిన ‘చిత్రలహరి’లోనూ `స్వేచ్ఛ` పాత్రలో ప్రేక్షకులను పలకరించిందీ భామ. ప్రస్తుతం నివేదా ఓ కీలక పాత్రలో నటించిన ‘బ్రోచేవారెవరురా’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే… తాజాగా ఈ టాలెంటెడ్ బ్యూటీని ఓ మెగా ప్రాజెక్ట్‌లో హీరోయిన్‌గా ఎంపిక చేసినట్టు సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఏస్ ఫిల్మ్ మేకర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కుటుంబ బంధాలకు పెద్ద పీట వేస్తూ రూపొందిస్తున్న ఈ సినిమాకు ‘నాన్న నేను’, ‘అలకనంద’ వంటి టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. కాగా, ఇద్దరు కథానాయికలకు స్థానమున్న ఈ చిత్రంలో ఇప్పటికే స్టన్నింగ్ బ్యూటీ పూజా హెగ్డేను ఓ కథానాయికగా ఎంపిక చేసారు. తాజాగా సెకండ్ హీరోయిన్‌గా నివేదా పేతురాజ్‌ను సెలెక్ట్ చేసిందట చిత్ర బృందం. అంతేకాదు… నివేదా గురువారం నుంచి షూటింగ్‌లో జాయిన్ అయినట్లు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో… నివేదా ఎంట్రీపై మరికొద్ది రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే… బన్నీ, త్రివిక్రమ్ చిత్రానికి సంబంధించిన రెండో షెడ్యూల్ బుధవారం నుంచి మొదలైంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో దాదాపు నెలరోజుల పాటు సాగే ఈ షెడ్యూల్‌లో కీలక పాత్రధారిణి టబు కూడా పాల్గొనబోతున్నట్టు టాక్. మాలీవుడ్ నటుడు జయరామ్ ఓ ముఖ్య పాత్రలో దర్శనమివ్వనున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తమన్ సంగీతం అందిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్… 2020 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం.
A beauti-ful performer with ever smiling face and abundance of talent. Welcome aboard #NivethaPethuraj! #AA19⁰⁰@alluarjun #Trivikram @hegdepooja @MusicThaman #PSVinod @GeethaArts @vamsi84 pic.twitter.com/aJ9RSU6lVa
— Haarika & Hassine Creations (@haarikahassine) June 7, 2019
[subscribe]
[youtube_video videoid=lS5CrgkciTo]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: