డిఫ‌రెంట్ రోల్‌లో సాయి తేజ్‌?

Latest Telugu Movies News, Maruthi And Sai Dharam Tej Film to go on Floors in June, Sai Dharam Tej as Playboy in Maruthi Movie, Sai Dharam Tej New Movie News, Sai Dharam Tej Next Film Updates, Sai Dharam Tej Role Revealed In Her Next Film, Sai Dharam Tej Upcoming Movie News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates
Sai Dharam Tej as Playboy in Maruthi Movie

ఈ వేస‌వికి విడుద‌లైన ‘చిత్రలహరి’తో మళ్ళీ సక్సెస్ ట్రాక్‌లోకి వ‌చ్చేశాడు మెగా హీరో సాయి తేజ్‌. కొత్త తరహా కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తేజుకి… ఈ కంటెంట్ ఓరియెంటెడ్ మూవీ బాగా వ‌ర్కవుట్ అయింద‌నే చెప్పాలి. ఈ విజ‌యం అందించిన ఉత్సాహంతో తన అప్‌క‌మింగ్ ప్రాజెక్ట్‌ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు ఈ మెగా హీరో. ప్రస్తుతం తేజు… యూత్‌ఫుల్ మూవీస్ స్పెషలిస్ట్ మారుతి డైరెక్షన్‌లో ‘భోగి’ (ప్రచారంలో ఉన్న పేరు) అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు… ఇదివ‌ర‌కు ఎప్పుడూ క‌నిపించ‌ని పాత్ర‌లో ఇందులో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నాడ‌ట ఈ `సుప్రీమ్‌` స్టార్‌.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివరాల్లోకి వెళితే… ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న `భోగి`లో మూడు తరాలకు చెందిన వ్యక్తుల (తాత, తండ్రి, తనయుడు) అనుబంధాలను తెరపై ఆవిష్కరించనున్నాడట మారుతి. ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ చుట్టూ అల్లుకున్న ఈ చిత్రంలో తేజు ప్లేబాయ్‌గా నటించనున్నాడట. తన మాటలతో, స్టైలిష్ లుక్స్‌తో అమ్మాయిలను వశ పరచుకునే పాత్రను… తేజు కోసం డిజైన్‌ చేసాడట మారుతి. అంతేకాదు… న‌లుగురు క‌థానాయిక‌ల‌కు స్థాన‌మున్న ఈ చిత్రంలో ఓ హీరోయిన్‌గా `నేల టిక్కెట్టు` ఫేమ్‌ మాళవిక శర్మ ఎంపికైన‌ట్లు తెలుస్తోంది. రావు రమేష్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కు… తమన్ స్వరాలను సమకూరుస్తున్నాడు.

త్వ‌ర‌లోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివ‌రాలు వెల్ల‌డి కానున్నాయి.

[subscribe]
[youtube_video videoid=gIQHYdck5Dk]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 2 =