‘లక్ష్యం’, ‘లౌక్యం’ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు శ్రీవాస్. హాస్యానికి పెద్ద పీట వేస్తూ రూపొందించిన ఈ రెండు సినిమాలు ప్రేక్షకాదరణ పొందాయి. ఇప్పుడు అదే కోవలో మరో చిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నాడట శ్రీవాస్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… ఇటీవల హిందీలో మంచి విజయాన్ని అందుకున్న కామెడీ ఎంటర్‌టైనర్ ‘దే దే ప్యార్ దే’ను తెలుగులో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా హిందీ రైట్స్‌ను అగ్ర నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ సొంతం చేసుకుంది. కాగా హిందీ వెర్షన్‌లో అజయ్ దేవగణ్ పోషించిన పాత్రను తెలుగు వెర్షన్‌లో విక్టరీ వెంకటేష్ చేయనున్నాడు. లేటెస్ట్ ఇన్‌ఫర్మేషన్ ప్రకారం… ఈ చిత్రానికి శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్నాడని తెలిసింది. అంతేకాదు… తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కథలో మార్పులు, చేర్పులు చేస్తున్నట్టు సమాచారం. కామెడీ ఎంటర్‌టైనర్‌లను బాగా తెరకెక్కిస్తాడన్న పేరున్న శ్రీవాస్… ఈ సినిమాతో ఎటువంటి ఫలితాన్ని రాబతాడో చూడాలి. త్వరలోనే శ్రీవాస్ ఎంట్రీపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.
[subscribe]
[youtube_video videoid=r-UFgEqi9iY]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: