ఆండ్రూ లూయిస్ దర్శకత్వంలో యాక్షన్ కింగ్ అర్జున్, తమిళ హీరో విజయ్ ఆంటోని ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా కొలైకరన్. తెలుగులో కిల్లర్ పేరుతో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాను రంజాన్ పండుగ సందర్భంగా జూన్ 7వ తేదీన రిలీజ్ చేయనున్నారు. ఇప్పుడు తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. ఎలాంటి కట్స్ లేకుండా ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ లభించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కునున్న ఈసినిమా లో విజయ్ ఆంటోనీ హంతకుడిగా, అర్జున్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా దియా మూవీస్ పతాకంపై ప్రదీప్ నిర్మిస్తుండగా.. తెలుగులో చదలవాడ శ్రీనివాసరావు రిలీజ్ చేయనున్నారు. ఆషిమా కథానాయిక కాగా సైమన్ కే కింగ్ సంగీతం అందించారు. మరి విజయ్ ఆంటోని, అర్జున్ కు ఇక్కడ కూడా మంచి ఫాలోయింగ్ ఉంది… మరి ఈ సినిమా ఎలా ఉంటుందో.. ఇక్కడి ప్రేక్షకులకు ఎంత వరకూ నచ్చుతుందో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేంతవరకూ ఆగాల్సిందే.
[subscribe]
[youtube_video videoid=U3KQmd_EBhw]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: