యంగ్ టైగర్ యన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్‌లో వస్తున్న మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ ఆర్ ఆర్’. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి రూపొందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని డీవీవీ దానయ్య ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నాడు. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో ఈ పిరియాడిక్ డ్రామా తెరకెక్కుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… చిత్రీకరణ సమయంలో తారక్, చరణ్ వేర్వేరు సందర్భాల్లో గాయపడటంతో షూటింగ్‌కు కొంత బ్రేక్ ఇచ్చిన విషయం విదితమే. అయితే… ఇప్పుడు వీరిద్దరూ గాయాల నుంచి కోలుకోవడంతో తాజాగా తదుపరి షెడ్యూల్‌ను ప్రారంభించారు. కాగా… ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభమైన ఈ షెడ్యూల్‌లో తారక్‌పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని టాక్. అయితే… ఈ షెడ్యూల్‌ని చాలా కట్టుదిట్టంగా ప్లాన్ చేశాడట జక్కన్న. గత షెడ్యూల్‌లో చిత్రీకరణ సమయంలో కొన్ని పిక్స్ లీక్ కావడంతో… ఇప్పుడు షూటింగ్ స్పాట్‌కి మొబైల్ ఫోన్స్‌ను కూడా అనుమతించడం లేదట. మొత్తానికి… ఆర్ ఆర్ ఆర్
రీసెంట్ షెడ్యూల్ చాలా సీక్రెట్‌గా జరుగుతోందన్నమాట.
కొమరం భీమ్‌గా తారక్, అల్లూరి సీతారామరాజుగా చరణ్ నటిస్తున్న ఆర్ ఆర్ ఆర్
… 2020 జూలై 30న విడుదల కానుంది.
[subscribe]
[youtube_video videoid=_myq-46Lp_c]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: