రాఘవ లారెన్స్ హీరోగా స్వీయ దర్శకత్వం లో రూపొందిన తమిళ మూవీ ముని, తెలుగు డబ్బింగ్ వెర్షన్ కాంచన ఘనవిజయం సాధించాయి. లారెన్స్ దర్శకత్వం లో అక్షయ్ కుమార్ హీరోగా కాంచన హిందీ రీమేక్ మూవీ లక్ష్మీ బాంబ్ అనౌన్స్ చేశారు. తన ప్రమేయం లేకుండా “లక్ష్మీ బాంబ్ ” మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయడంతో అవమానం గా భావించి ఆ మూవీ నుండి వైదొలుతున్నట్టుగా లారెన్స్
ప్రకటించిన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దర్శకుడు లారెన్స్, నిర్మాతల మధ్య వివాదం సమసిపోవడంతో, లక్ష్మీ బాంబ్ హిందీ మూవీ కి తానే దర్శకత్వం వహిస్తున్నట్టు లారెన్స్ ప్రకటించారు. తన ఫీలింగ్స్ అర్ధం చేసుకుని సమస్యను పరిష్కరించిన హీరో అక్షయ్ కుమార్ కు ధన్యవాదాలు అని , నిర్మాత షబానా ఖాన్ కు కృతజ్ఞతలు అని లారెన్స్ ట్వీట్ చేశారు. హీరో అక్షయ్ కుమార్ తో తాను ఉన్న ఫోటో ను షేర్ చేశారు.
[subscribe]
[youtube_video videoid=s_3C0kRM-1s]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: