రైతుగా, ఎన్నారైగా చిరు ద్విపాత్రాభిన‌యం?

Chiranjeevi Role Revealed in Koratala Siva Movie,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Chiranjeevi Role in Koratala Siva Movie,Chiranjeevi and Koratala Siva New Movie Latest Updates,Chiranjeevi Upcoming Film News,Chiranjeevi To Play an Important Role in His Next Film
Chiranjeevi Role Revealed in Koratala Siva Movie

వాణిజ్యపరమైన అంశాలతో సినిమాలను తెరకెక్కిస్తూనే… వాటిలో అంతర్లీనంగా సామాజిక అంశాలనూ టచ్ చేయడం దర్శకుడు కొరటాల శివ స్టైల్. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో చేయబోయే తన తదుపరి చిత్రం కోసం కూడా అటువంటి కథనే సిద్ధం చేసాడట ఈ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివరాల్లోకి వెళితే… చిరు, కొరటాల కలయికలో ఓ భారీ బ‌డ్జెట్ మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇందులో చిరు డ్యూయల్ రోల్‌లో దర్శనమివ్వనున్నాడని టాక్. వాటిలో ఒకటి రైతు పాత్ర కాగా… మరొకటి ఎన్నారై పాత్ర అని సమాచారం. అంతేకాదు… ఈ సినిమాలో ఓ వైపు కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఆడియన్స్‌ను అల‌రిస్తూనే… మరోవైపు అంతర్లీనంగా సామాజిక అంశాన్ని టచ్ చేయనున్నాడ‌ట కొరటాల. అలాగే కథానుసారం రైతుల‌ సమస్యలను ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్టు చూపించబోతున్నాడ‌ట. ఈ నేప‌థ్యంలో… వారికి సంబంధించిన చాలా సమస్యలను లోతుగా చర్చించడం కూడా జరుగుతుందట. ఇవ‌న్నీ కూడా జ‌న‌రంజ‌కంగా ఉంటాయని తెలుస్తోంది. క‌రెక్ట్‌గా చెప్పాలంటే… ఈ చిత్రంలో చిరు పోషిస్తున్న‌ రైతు పాత్రే హైలైట్‌గా ఉంటుందని టాక్‌.

కాగా.. ఆగ‌స్టు 22న ప్రారంభం కానున్న ఈ సినిమా సెప్టెంబ‌ర్ నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనుంది. 2020 ఉగాదికి ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ తెర‌పైకి రానుంద‌ని స‌మాచారం. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ‌లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించ‌నున్నాయి.

[subscribe]

[youtube_video videoid=Q0WrJ6epCl4]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × one =