పాపం కోలీవుడ్ స్టార్ విశాల్ అయోగ్య సినిమా రిలీజ్ కు ఇబ్బందులు వస్తూనే ఉన్నాయి. తెలుగులో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ‘టెంపర్’ సినిమా కు రీమేక్ గా ఈ సినిమాను రూపొందించారు. ఇప్పటికే హిందీలో ‘సింబా’ పేరుతో విడుదలై అక్కడ కూడా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు కానీ.. రిలీజ్ డేట్ మాత్రం కుదరట్లేదు. ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది. మొదట ఈ సినిమాను ఏప్రిల్ 19వ తేదీన రిలీజ్ చేద్దామనుకున్నారు.. అది కుదరలేదు. ఆ తరువాత మళ్లీ మే 10 వ తేదీ అంటే ఈరోజుకి వాయిదా వేశారు. ఏమైందో ఏమో తెలియదు కానీ ఈరోజు కూడా ఈ సినిమా రిలీజ్ కు నోచుకోలేదు. ఈ సినిమా రిలీజ్ చివరి నిమిషంలో వాయిదా పడింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా రిలీజ్ కాకపోవడానికి కారణం ఏంటో తెలియదు కానీ… ఈ విషయంపై సోషల్ మీడియాలో స్పందించిన విశాల్, ‘సినిమా రిలీజ్ కోసం తాను చేయాల్సినదంతా చేశాను. ఓ నటుడిగా చేయాల్సిన దానికంటే ఎక్కువే చేశాను. అయినా సరిపోలేదు’ అంటూ ట్వీట్ చేశారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు చిత్ర యూనిట్.
కాగా వెంకట్ మోహన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విశాల్ సరసన కథానాయికగా రాశి ఖన్నా నటిస్తుంది. పార్తీబన్ ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. మరి తెలుగు.. హిందీ భాషల్లో భారీ విజయాన్ని నమోదు చేసిన ఈ సినిమా, తమిళంలో ఎంత వరకూ విజయం దక్కించుకుంటుందో.
[subscribe]
[youtube_video videoid=Q4CFWcT5hPc]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: