వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు సిల్వర్ జూబ్లీ సినిమా మహర్షి నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మొదటి రోజే పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది ఈ సినిమా. సామాజిక సందేశంతో తెరకెక్కిన ఈసినిమాలో మహేష్ నటనకు ప్రశంసలు దక్కాయి. స్టూడెంట్ గా.. కార్పొరేట్ కంపెనీ సీఈఓగా.. గ్రామానికి వచ్చిన తరువాత విలేజ్ గెటప్ లో ఇలా మూడు షెడ్స్ లో బాగా నటించాడు. ఇక ఈసినిమాలో మరో కీలక పాత్రలో నటించిన అల్లరి నరేష్ ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఎమోషనల్ పాత్రలో చాలా బాగా నటించాడు. ఇక ప్రస్తుతం థియేటర్లలో పోటీకి సినిమాలు కూడా లేవు కాబట్టి కలెక్షన్లు కూడా బాగా రాబట్టే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా తొలి రోజున భారీ వసూళ్లను రాబట్టింది. తొలిరోజున ఈ రెండు రాష్ట్రాల్లోనూ కలిపి ఈ సినిమా 24.6 కోట్ల షేర్ ను సాధించినట్టు తెలుస్తోంది. మరి ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం…
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నైజాం – 6.38 కోట్లు
సీడెడ్ – 2.89 కోట్లు
యూఏ – 2.88 కోట్లు
ఈస్ట్ – 3.2 కోట్లు
వెస్ట్ – 2.46 కోట్లు
గుంటూరు – 4.4 కోట్లు
కృష్ణ – 1.39 కోట్లు
నెల్లూరు – 1.00 కోట్లు
టోటల్ ఏపీ/తెలంగాణ ఫస్ట్ డే కలెక్షన్స్ – 24.24 కోట్లు
[subscribe]
[youtube_video videoid=B9_AnB9WRZw ]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: