ఈ సంక్రాంతికి విడుదలైన మల్టీస్టారర్ మూవీ ‘ఎఫ్ 2’తో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్.. ప్రస్తుతం… తన మేనల్లుడు, యువ కథానాయకుడు నాగ చైతన్యతో కలసి ‘వెంకీ మామ’ అనే మరో మల్టీస్టారర్‌లో నటిస్తున్న విషయం తెలిసిందే. కె.ఎస్.రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో వెంకీ సరసన పాయల్ రాజ్‌పుత్ నటిస్తుండగా… చైతుకి జంటగా రాశి ఖన్నా కనిపించనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
వినోదం, ప్రేమ, ప్రతీకారం, రాజకీయాలు, భావోద్వేగాల సమాహారంగా ఈ సినిమా రూపొందుతోందని సమాచారం. ఈ నేపథ్యంలోనే… ఇటీవల రామోజీ ఫిలింసిటీలో రాజకీయ బహిరంగ సభ నేపథ్యంలో కొన్ని సన్నివేశాలను తెరకెక్కించారు. కాగా… ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన ఓ ప్రత్యేక సెట్‌లో వెంకీ, చైతు, రాశి ఖన్నాలపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని టాక్. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని సురేష్ బాబు, టి.జి.విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.దసరా కానుకగా వెంకీమామ
తెరపైకి రానుందని సమాచారం.
[subscribe]
[youtube_video videoid=bJAKvOx_UE4]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: