సెల్వ రాఘవన్ దర్శకత్వంలో తమిళ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ఎన్జీకే(నంద గోపాల కృష్ణ). ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను రంజాన్ సందర్భంగా జూన్ 5న గానీ లేదా 6న గానీ ఈ సినిమా విడుదల చేసే అవకాశమున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసందే. త్వరలోనే రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించనున్నారు చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పటికే విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ చిత్రంపై అభిమానులలో చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగిపోయాయి. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.
కాగా పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈసినిమాలో సూర్యకి జంటగా రకుల్ ప్రీత్ సింగ్, సాయిపల్లవి నటిస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్.ఆర్. ప్రభు నిర్మాణంలో రూపొందుతున్నఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతమందిస్తున్నాడు. రంజాన్ సందర్భంగా ఈ సినిమా విడుదలయ్యే అవకాశముందని తెలుస్తోంది. మరి అభిమానుల అంచనాలను సూర్య రీచ్ అవుతారో?లేదో? చూద్దాం.
[subscribe]
[youtube_video videoid=17dGrlBUp_w]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: