ఈ నెలలో వచ్చిన మజిలీ, చిత్రలహరి, జెర్సీ సినిమాలు తెలుగు సినీ పరిశ్రమకు మంచి హిట్స్ ను తెచ్చిపెట్టారు. ఎమోషనల్ డ్రామాలుగా తెరకెక్కిన ఈ మూడు సినిమాలు ప్రేక్షకులకు నచ్చడంతో బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నాయి. వీటితో పాటు డిఫరెంట్ జోనర్ లో వచ్చిన కాంచన సినిమా కూడా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. తెలుగు .. తమిళ భాషల్లో ఈ నెల 19వ తేదీన విడుదలైన ఈ సినిమా బి సి సెంటర్స్ లో భారీ వసూళ్లను రాబడుతూ దూసుకుపోతోంది. అంతేకాదు మొదటినుండి జెర్సీ కలెక్షన్స్ కు మంచి పోటీ ఇస్తూ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబడుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఇప్పుడు ఈసినిమా 100 కోట్ల క్లబ్ లోకి చేరినట్టు తెలుస్తోంది. తొలివారం రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 100 కోట్ల మార్క్ ను క్రాస్ చేసేసింది. అంతేకాదు ఇంకా ఈ సినిమా వసూళ్ల పరంగా అదే జోరును కొనసాగిస్తూ ఉండటం విశేషం. దగ్గర్లో సినిమాలు కూడా రిలీజ్ కు కూడా లేవు కాబట్టి ఈ హవా మరికొద్ది రోజులు కొనసాగే అవకాశం ఉందంటున్నారు.
[subscribe]
[youtube_video videoid=9xGLD-XIEq8]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: