సురేష్ ప్రొడక్షన్స్.. మన తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న పెద్ద ప్రొడక్షన్ హౌస్ లలో సురేష్ ప్రొడక్షన్ కూడా ఒకటి. ఎన్నో ఏళ్ల క్రితం స్థాపించిన ఈ ప్రొడక్షన్ హౌస్ నుండి ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు నిర్మించబడ్డాయి. అటు పెద్ద పెద్ద సినిమాలతో పాటు పెళ్లి చూపులు, కేరాఫ్ కంచరపాలెం లాంటి చిన్న సినిమాలను కూడా తమ ప్రొడక్షన్ హౌస్ నుండి రిలీజ్ చేస్తూ ప్రోత్సాహం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈఏడాది ఏకంగా ఆరు సినిమాలను రిలీజ్ చేసేందుకు సిద్దమైంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో అల్లు శిరిష్ హీరోగా మలయాళంలో ఘన విజయం సాధించిన ‘ఏబిసిడి’ సినిమా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఏస్పీ ప్రొడక్షన్ నిర్మాణంలోనే రూపొందించారు. దీనితో పాటు సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ఓ బేబి’ సినిమా, విజయ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ రాజశేఖర్ జీవితల తనయ శివాత్మిక డెబ్యూ మూవీ ‘దొరసాని’, మలయాళం కల్ట్ క్రైమ్ డ్రామా అంగమలై డైరీస్ తెలుగు రీమేక్ ‘ఫలక్ నామా దాస్’, ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తున్న పద్మ శ్రీ చింతకింది ‘మల్లేశం’ బయోపిక్ మల్లేశం.. శ్రీ విష్ణు, నివేదా థామస్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ‘బ్రోచేవారెవరురా’ ఇలా పలు సినిమాలు ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
మరి పైన చెప్పిన సినిమాలన్నీ దాదాపు చిన్న సినిమాలే. ప్రస్తుతం పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలకు కూడా మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. మంచి కంటెంట్ ఉంటే చాలు ప్రేక్షకులు కూడా పెద్ద సినిమా? చిన్న సినిమా ? అని చూడట్లేదు…చిన్న సినిమాను సైతం బ్లాక్ బస్టర్ హిట్స్ చేస్తున్నారు. అలా చేసిందే పెళ్లి చూపులు సినిమా. మరి ఎస్పీ ప్రొడక్షన్స్ ఈ ఫార్ములాను బాగా ఫాలో అవుతున్నట్టు ఉంది. మరి ఇన్ని సినిమాల్లో ఏ సినిమా హిట్ అవుతుందో? ఏ సినిమా ఫట్ అవుతుందో? చూద్దాం..
[subscribe]
[youtube_video videoid=ILY3zkBenNU]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: