ఒక సినిమా హిట్టయిందంటే చాలు ఆ సినిమాను ఇతర భాషల్లో రీమేక్ చేయడమో.. లేక సీక్వెల్స్ చేయడమే చేస్తుంటారు. ఇది సినీ పరిశ్రమలో ఎప్పటినుండో వస్తున్న సంప్రదాయమే. అయితే గత కొంత కాలంగా సీక్వెల్స్ కు కొంత బ్రేక్ పడినా.. ఇప్పుడు మళ్లీ టాలీవుడ్‌లో సీక్వెల్స్ సందడి మొదలైంది. స్టార్ హీరోల నుంచి కుర్ర హీరోల వరకు సీక్వెల్స్ పనిలో పడ్డారు. మరి ఆ సీక్వెల్స్ ఏంటో ఒకసారి చూద్దాం..
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మన్మథుడు సీక్వెల్
టాలీవుడ్ మన్మథుడు నాగార్జున.. తన కెరీర్ లోనే ఎవర్ గ్రీన్ మూవీ అయిన మన్మథుడు సినిమాను సీక్వెల్ చేసే పనిలో పడ్డారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమా ఇటీవలే ప్రారంభమైన షూటింగ్ కూడా జరుపుకుంటుంది. మన్మథుడు 2 పేరుతో తెరకెక్కుతున్న ఈసినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది.
ఇక మన్మథుడు సీక్వెల్ తో పాటు నాగార్జున మరో తన హిట్ మూవీ ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమా సీక్వెల్ కూడా తీయనున్నట్టు గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బంగార్రాజు, రామ్మోహన్‌గా గా రెండు పాత్రల్లో తన నటనతో మెప్పించాడు నాగార్జున. ముఖ్యంగా బంగార్రాజు పాత్రకు మంచి పేరొచ్చింది. ఇక ఆ పాత్రనే ప్రధానంగా తీసుకొని ఈ సినిమా సీక్వెలన్ రూపొందిస్తామని ఆ చిత్ర దర్శకుడు కల్యాణ్ కృష్ణ ఎప్పుడో ప్రకటించేశారు. మరి ఇది ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి.
ఎఫ్ 2 సీక్వెల్
అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన మల్టీస్టారర్ ఎఫ్ 2 ఎంత సంచలన విజయం దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సంక్రాంతికి బరిలో దిగిన ఈ సినిమా పెద్ద సినిమాలను సైతం పక్కకు నెట్టి విన్నర్ గా నిలిచింది. అటు వెంకీ కి కానీ.. ఇటు వరుణ్ కు కానీ.. ప్రొడ్యూసర్ దిల్ రాజు కు అందరికీ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ అందించింది. ఇక ఈసినిమా సీక్వెల్ కూడా ఉంటుందని ఎప్పుడో చెప్పేశారు. ఎఫ్ 3 పేరుతో రూపొందించబోయే ఈ సీక్వెల్ లో వెంకీ, వరుణ్ తో పాటు మరో స్టార్ హీరో కూడా నటించనున్నారని చెప్పారు. అంతేకాదు ఆ హీరో రవితేజ అని కూడా వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం అనిల్ తన తరువాత సినిమాను మహేష్ తో చేయనున్నాడు. ఈసినిమా అయిపోయిన తరువాత ఎఫ్ 3 సినిమా తెరకెక్కే అవకాశం ఉంది.
కార్తికేయ సీక్వెల్
నిఖిల్, కలర్స్ స్వాతి హీరో హీరోయిన్లుగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కార్తికేయ మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ ను కూడా తెరకెక్కించనున్నారు. గత కొద్దికాలంగా ఈ సినిమాపై వార్తలు కూడా వస్తున్నాయి. అయితే ఈ వార్తలకు క్లారిటీ ఇస్తూ సీక్వెల్ ను రూపొందించనున్నట్టు క్లారిటీ ఇచ్చారు ఇటీవలే. ఇప్పటికే చందూ మొండేటి కథను కూడా సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది.
భారతీయుడు సీక్వెల్
గతంలో శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన భారతీయుడు సినిమా ఎంత పెద్ద సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ‘భారతీయుడు’ సినిమాలో ద్విపాత్రాభినయం చేసిన కమల్ హాసన్ నటనను ఎవరు మరిచిపోలేదు. ముఖ్యంగా వృద్ద కమల్ హాసన్ పాత్ర ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదుమళ్లీ ఇన్నేళ్లకు ఈ సినిమా సీక్వెల్ ను చేయడానికి సిద్దమయ్యారు కమల్ హాసన్, శంకర్. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. అయితే కొన్ని కారణాలవల్ల ప్రస్తుతం షూటింగ్ కు బ్రేక్ పడింది. వచ్చే ఏడాది ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు.
మరి గతంలో వచ్చిన సీక్వెల్స్ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. చంద్రముఖి సీక్వెల్ నాగవల్లి, కిక్ సీక్వెల్ కిక్ 2, గబ్బర్ సింగ్ సీక్వెల్ సర్దార్ గబ్బర్ కింగ్ ఇలా ఈ సీక్వెల్స్ ఏవీ వర్కవుట్ కాలేదు. మరి ఇప్పుడు పైన చెప్పిన హిట్ మూవీస్ కు సీక్వెల్స్ తీస్తున్నారు. మరి ఈసినిమాలు ఎంత వరకూ సక్సెస్ అవుతాయో చూద్దాం..
[subscribe]
[youtube_video videoid=US9kvc0tL5M]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: