చిన్నప్పటి నుండి తెలుగు ఇండస్ట్రీలో ఉన్న స్టార్ కమెడియన్ కమ్ హీరో ఎవరైనా ఉన్నారంటే అది అలీ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా, హీరో ఎన్నో సినిమాల్లో నటించి… మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అలీ. అయితే ప్రస్తుతం కొత్త కొత్త కమెడియన్లు వస్తున్న నేపథ్యంలో కాస్త సినిమాలు అవశాలు తగ్గినా.. బుల్లి తెరపై మాత్రం సందడి చేస్తూనే ఉన్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే తాజా సమాచారం ప్రకారం అలీ బాలీవుడ్ లోని ఓ మూవీలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. అది ఎవరి సినిమానో కాదు.. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సినిమా. సల్మాన్ ఖాన్ దబాంగ్ 3 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఓ మంచి రోల్ లో నటించే అవకాశం అలీకి దక్కినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లో ఉన్న అలీ.. తన ఫ్యామిలీ సల్మాన్ తో కలిసి తీసుకున్న ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా ఈ సినిమాకు ప్రభుదేవ దర్శకత్వం వహిస్తుండగా… సోనాక్షి సిన్హా హీరోయిన్ గా నటిస్తుంది.

[subscribe]
[youtube_video videoid=UpzadgdZ6Zk]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: