చకోర పక్షి వర్షం కోసం ఎలా ఎదురచూస్తుందో.. అలా మన ఇండస్ట్రీ గత కొద్ది రోజులుగా మంచి హిట్ కోసం ఎదురుచూస్తుంది. ఈ ఏడాది ప్రారంభంలో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాల్లో ఒక్క ఎఫ్ 2 మినహా పెద్ద సినిమాలు సహా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఆ తరువాత ఫిబ్రవరిలో ఒక్కటంటే ఒక్క సినిమా కూడా లేదు. ఇక మార్చిలో 118 సినిమా కాస్త ఊరట నిచ్చింది. ఏడాది ప్రారంభమైన నాలుగు నెలల్లో కేవలం రెండు సినిమాలు తప్పితే తెలుగు ఇండస్ట్రీకి చెప్పుకోతగ్గ హిట్టే దక్కలేదు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దీంతో ఈ నెలలో వచ్చే సినిమాలపైనే ఆశలు పెట్టుకున్నారు అందరూ. అయితే ఆ ఆశలకు, ఎదురుచూపులకు ఈ ఏప్రిల్ బిగ్ రిలీఫే ఇచ్చింది. మజిలీతో మొదలైన బాక్సాఫీస్ సందడి జెర్సీ వరకూ కొనసాగింది. మూడు వరుస హిట్ సినిమాలతో తెలుగు ఇండస్ట్రీకి ఈనెల ప్రత్యేకంగా నిలిచింది. ఇంకా ఆశ్యర్యకమైన విషయం ఏంటంటే.. నాగచైతన్య, సాయి తేజ్, నానికి కూడా మంచి హిట్ కావాల్సిన పరిస్థితిలో వాళ్ల కెరీర్ లోనే బెస్ట్ హిట్స్ ను అందుకున్నారు.
ముందుగా ఏప్రిల్ 5న విడుదలైన మజిలీ సినిమా… నిన్ను కోరి సినిమాతో మంచి పేరు సంపాదించుకున్న శివ నిర్వాణ దర్శకత్వంలో నాగచైతన్య, సమంత, దివ్యాన్ష కౌషిక్, రావు రమేష్, పోసాని, సుబ్బరాజు, అతుల్ కులకర్ణి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. ముఖ్యంగా సమంత, నాగ చైతన్య మధ్య ఎమోషనల్ సీన్స్ కు ఆడియన్స్ ఫిదా అయిపోయారు.
ఇక రెండో వారంలో వచ్చిన చిత్రలహరి సినిమా కూడా మంచి హిట్ ను సొంతం చేసుకుంది. గత కొద్ది కాలంగా తేజ్ మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాపై మంచి హోప్స్ పెట్టుకున్నాడు. తన హోప్స్ ను నిజం చేస్తూ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ ను సొంతం చేసుకుంది. ఇక ఈసినిమాలో కూడా తండ్రి కొడుకుల అనుబంధం, ఎమోషన్ సీన్స్ ప్రేక్షకులకు ఆకట్టుకున్నాయి. దీంతో చిత్రలహరికి హిట్ ఇచ్చేశారు. ఇప్పటికే చిత్రలహరి చాలా ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయింది. మిగిలిన ఏరియాల్లో కూడా త్వరలో బ్రేక్ ఈవెన్ అవ్వడానికి సిద్ధంగా ఉంది.
ఇక నిన్న విడుదలైన జెర్సీ సినిమా కూడా మంచి ఎమోషనల్ హిట్ ను సొంతం చేసుకుంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని, శ్రద్ధ శ్రీనాథ్, సత్యరాజ్, రావు రమేష్, రోనీత్ కమ్రా ప్రధాన పాత్రల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన జెర్సీ సినిమాలో తన సహజమైన నటనతో సినిమాకు ప్రాణం పోశాడు. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో కళ్ళతో పలికించిన ఎక్స్ ప్రెషన్స్ సినిమాకు హైలైట్ అయ్యాయి. యంగ్ & మిడిల్ ఏజ్డ్ గా సినిమా లో వన్ మ్యాన్ షో చేసాడు. దీంతో సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు అందరూ..
ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ మూడు సినిమాల్లో కూడా కొన్ని కామన్ పాయింట్స్ ఉన్నాయి. ఎమోషన్స్, తండ్రి కొడుకుల మధ్య అనుబంధం. అంతేకాదు మూడు సినిమాల్లో కూడా హీరోలు హోప్ లెస్ తోనే ఉంటారు. మజిలీలో.. చిత్రలహరిలో.. జెర్సీ సినిమాలో ఆ ఎమోషన్స్ కు పెద్ద పీట వేశారు. ప్రేక్షకులు కూడా ఈ ఎమోషన్స్ కే కనెక్ట్ అయ్యారు. హిట్ ఇచ్చేశారు. మొత్తానికి మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో వచ్చిన ఈ మూడు సినిమాలు మంచి హిట్ అవ్వడమే కాదు.. హీరోల ప్లాప్ ల పరంపరకు బ్రేక్ వేసి హీరోలతో పాటు ప్రేక్షకులకు కూడా బిగ్ రిలీఫే ఇచ్చింది. మరి మే నెలల్లో కూడా కొన్ని సినిమాలు ఉన్నాయి..వాటి భవిష్యత్తు ఎలా ఉందో తెలియాలంటే మే వరకూ ఆగాల్సిందే.
[subscribe]
[youtube_video videoid=OA9UJoV8eBk]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: