టి-సిరీస్, సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందిన భారత్ మూవీ రంజాన్ పండుగ కానుకగా జూన్ 5వ తేదీ ప్రపంచ వ్యాప్తం గా రిలీజ్ కానుంది. తెలుగు, తమిళ, హిందీ భాషలలో రిలీజ్ కానున్న భారత్ మూవీ తెలుగు వెర్షన్ లో సల్మాన్ ఖాన్ కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వాయిస్ ఇస్తున్నారు. సల్మాన్ ఖాన్, రామ్ చరణ్ ల మధ్య క్లోజ్ బాండింగ్ ఉంది. అంతకుముందు సల్మాన్ ఖాన్ నటించిన సూపర్ హిట్ మూవీ ప్రేమ్ రతన్ ధన్ పాయో మూవీ లో కూడా సల్మాన్ కు రామ్ చరణ్ వాయిస్ ఇచ్చిన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
రెండు షేడ్స్ లో సల్మాన్ ఖాన్ నటించిన భారత్ మూవీ లో కథానాయికలుగా కత్రినా కైఫ్, దిశా పటాని నటిస్తున్నారు. విశాల్ – శేఖర్ సంగీతం అందించారు. అలీ అబ్బాస్ జాఫర్, సల్మాన్ ఖాన్ కాంబినేషన్ లో రూపొందిన సుల్తాన్, టైగర్ జిందా హై మూవీస్ రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఆ హిట్ కాంబినేషన్ లో రూపొందిన భారత్ మూవీ పై ప్రేక్షకులకు, సల్మాన్ అభిమానులకు భారీ అంచనాలున్నాయి.
[subscribe]
[youtube_video videoid=cYox9avsuTg]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: