జెర్సీ సినిమా గురించి నాని ముచ్చట్లు

Nani Opens Up About Jersey Movie,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Nani Talks About Jersey Movie,Natural Star Nani New Movie Updates,Nani About His Role in Jersey Movie,Nani Jersey Movie Details Revealed
Nani Opens Up About Jersey Movie

మళ్లీరావా ఫేమ్‌ గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో నాని, శ్రద్దా శ్రీనాథ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా జెర్సీ. ఈ నెల 19వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో నాని మీడియా తో మాట్లాడారు. ఆ విశేషాలు ఏంటో ఒకసారి చూద్దాం…

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

జెర్సీ ,రమణ్ లంబా బయోపిక్ అంటున్నారు నిజమేనా ?

లేదండీ… ఆయన ఒరిజినల్ లైఫ్ గురించి నాకు తెలీదు.. ఆయన కూడా కొంత గ్యాప్ ఇచ్చి కమ్ బ్యాక్ ఇచ్చిఉండొచ్చు.. అది రిలేట్ అయి సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈన్యూస్ నా వరకూ వచ్చింది.. ఒక సారి సినిమా చూసాక ప్రేక్షకులకు అర్ధమవుతుంది. ఇది ఫిక్షనల్ స్టోరీ మాత్రమే ఎవరి బయోపిక్ కాదుని తెలిపారు.

మజిలీ కి, జెర్సీకి కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయంటున్నారు.. మీరేమంటారు?

నేను చూడలేదు కాబట్టి సమిలారిటీస్ చెప్పలేను.. శివ మావాడు.. నాకు ఎప్పటికప్పుడు టీజర్, ట్రైలర్, రెగ్యులర్ అప్ డేట్స్ పంపిస్తూనే ఉండేవాడు.. నాకు చాలా బాగా నచ్చేశాయి.. నిజంగా జెర్సీ షూటింగ్ కనుక లేకపోయివుంటే ఫస్ట్ నేనే సినిమా చూసి ఉండేవాడిని..

ఈ సినిమా కోసం ఎక్కడ శిక్షణ తీసుకున్నారు?

డేనియ‌ల్ క్రికెట్ అకాడమీ లో ట్రైనింగ్ తీసుకున్నాను. అది సిటీలోనే బెస్ట్ క్రికెట్ అకాడమీ. డేనియ‌ల్ నాకు శిక్ష‌ణ ఇచ్చారు. షూటింగ్ స్పాట్‌కి కూడా ఆయ‌న వచ్చేవారు.

మళ్ళీరావా చూసి ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నారా ?

నేను ఆ సినిమా చూడలేదు. గౌతమ్ స్టోరీ నరేషన్ ఇస్తున్నప్పుడు పాత్ర‌లో నేను లీన‌మైపోయాను. అత‌నిలో నిజాయ‌తీ న‌చ్చింది. అందుకే నేను అత‌ని ప్రీవియ‌స్ సినిమా చూసి జ‌డ్జి చేయాల‌ని అనుకోలేదు. నేనే కాదు, ఈ సినిమా చేసిన వారంద‌రూ చాలా గొప్ప ప‌ని చేశామ‌నే ఫీలింగ్‌లో ఉన్నారు. సంతోషంతో క‌ళ్ల‌ల్లో నీళ్లు తిరిగే సీన్లు కూడా ఉన్నాయి.

హ్యాపీ ఎండింగ్ ఉంటుందా?

హండ్రెడ్ పర్సెంట్ అండీ.. నవ్వుకుంటూ.. ఒక ఎగ్జైట్ మెంట్ తో బయటకు వస్తారు అందరూ.

గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో నటించడం గురించి?

గౌతమ్‌ తెరకెక్కించిన ‘మళ్ళీ రావా’ నేను చూడలేదు. కానీ మంచి సినిమా అని ఆడియన్స్‌ నిర్ణయించారని చెబితే విన్నాను. గౌతమ్‌తో వర్క్‌ చేయడం చాలా సంతోషంగా ఉంది. మంచి ప్రతిభ ఉన్న దర్శకుడు. సినిమాలో ఉన్న ప్రతి ఫ్రేమ్‌లో గౌతమ్‌ వర్క్‌ తెలుస్తుంది.

స్టార్‌ అనే మాటపై మీ అభిప్రాయం?

స్టార్‌డమ్‌ని నమ్ముతా. కానీ దాని గురించి ఇప్పుడు వినిపిస్తున్న అర్థాలపై మాత్రం నమ్మకం లేదు. కంటెంట్‌ వల్లే స్టార్‌డమ్‌ వస్తుందనేది నా అభిప్రాయం.

సినిమా సినిమాకీ అంచనాలు… ఫలితాలు మీపైన ఒత్తిడిని పెంచుతుంటాయా?

అదంతా నాకు అలవాటైంది. ‘జెండాపై కపిరాజు’, ‘పైసా’, ‘ఆహా కళ్యాణం’… ఇలా వరుసగా పరాజయాలొచ్చాయి. ఆ తర్వాత రెండేళ్లు నా నుంచి సినిమా రాలేదు. కానీ ఏ దశలోనూ ఒత్తిడికి గురికాలేదు. నా దగ్గరికొచ్చిన కథల్ని ఎంపిక చేసుకొని… అలా చేసుకుంటూ వెళ్లిపోతున్నా, అదే నాకు ప్లస్‌ అవుతూ వస్తోంది.

వెబ్‌ సిరీస్‌లు చేసే ఆలోచన ఏమైనా ఉందా?

ప్రస్తుతమైతే నేను దాని గురించి ప్లాన్ చేయలేదు.. డిజిటల్‌ మీడియా ఊహించనంత ఎత్తుకు వెళ్లబోతోంది.. అది ఎలాంటి మార్పుని తీసుకొస్తుంది.. సినిమా అది ఎలా కలవబోతుంది అన్న దానిపై నాకు ఇంకా అంతా సాలిడ్ క్లారిటీ లేదు.. ఇప్పుడు నాకున్న కమిట్ మెంట్స్ చూస్తే వచ్చే ఏడాది వరకూ టైం పడుతుంది. ఈ రెండేళ్లలో ఏమన్నా జరగొచ్చు.. ఫ్యూచరే డిసైడ్ చేస్తుంది. ప్రస్తుతం అగ్ర నిర్మాణ సంస్థలు చాలా వరకు వెబ్‌ సిరీస్‌ల నిర్మాణంపై దృష్టిపెడుతున్నాయి.

ప్రయోగాల వల్ల ఓవర్సీస్‌ మార్కెట్‌ మనకు అనుకూలంగా మారిందనుకోవచ్చా?

ఎక్స్ పరిమెంటల్ ఫిలింస్ ను ఎప్రిషియేట్ చేసేది కాదండి ఓవర్సీస్.. నిజానికి ఓవర్సీస్ చాలా కమర్షియల్.. ప్రొపర్ కమర్షియల్ ఫిలింస్ ను చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అక్కడ.. అయితే ఓవర్సీస్ మార్కెట్ పెరగడమనేది మాత్రం.. సినిమాకు ఇంకో బిగ్గర్ అడ్వాంటేజ్..అంటే ఇప్పుడు మన సినిమా మార్కెట్ పెరగడానికి కానీ.. మనం చెప్పాలనుకున్న కథలు అంత క్వాలిటీగా చెప్పడానికి.. మన బడ్జెట్ కు కానీ.. ఓవర్సీస్ ఒకటి.. హిందీ మార్కెట్ ఒకటి.. చాలా బాగా ఉపయోగపడతాయి.

అర్జున్‌ పాత్ర మీపై ఎలాంటి ప్రభావం చూపించింది?

సినిమా ఆఖరి రోజు చాలా భావోద్వేగానికి గురయ్యా. మనసుకు బాగా దగ్గరైన వ్యక్తికి వీడ్కోలు పలికి వస్తున్నట్టు అనిపించింది.

ఈ సినిమా నిర్మాత గురించి ?

నేను , వంశీ క్లాస్ మేట్స్. ఒక‌సారి మా క్లాస్‌మేట్ క‌లిసిన‌ప్పుడు ఇండ‌స్ట్రీలో వంశీ ఉన్నాడ‌ని తెలిసింది. ఈ సినిమాకు ముందు మాట్లాడుకున్నాం. ఈ సినిమా మొత్తానికి కాస్త కంగారుగా ఎవ‌రైనా ఉన్నారా అంటే అది వంశీ మాత్ర‌మే. తను జెన్యూన్ ప్రొడ్యూస‌ర్‌.

[subscribe]


[youtube_video videoid=Rl6T0bM94Qs]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 5 =