‘హ్యపీడేస్’… కాలేజీ ఫ్రెండ్‌షిప్ గురించి కళ్ళకు కట్టినట్లు చూపించిన సినిమా. ఆ చిత్రంలో నటించిన నటీనటులలో చాలా మంది ఒకటి, రెండు సినిమాలకి మాత్రమే పరిమితమయ్యారు. కానీ, ఆ సినిమాలో హీరోయిన్‌గా నటించిన తమన్నా మాత్రం తన గ్లామర్‌తోను, నటనతోను, డ్యాన్స్‌లతోను స్టార్ హీరోయిన్‌గా ఎదిగితే… ఆ మూవీలో ఒక హీరోగా నటించిన నిఖిల్ భిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ వైవిధ్యభరితమైన చిత్రాలతో ముందుకు సాగుతున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కట్ చేస్తే… ఆ సినిమాలో స్నేహితులుగా కలసి నటించిన ఈ ఇద్దరు టాలెంటెడ్ స్టార్స్… ఇప్పుడు దాదాపు 12 ఏళ్ళ తర్వాత తమ రాబోయే చిత్రాలతో పోటీ పడుతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే… 2016లో తమిళంతో పాటు తెలుగు, హిందీలో కూడా విడుదలై విజయం సాధించిన చిత్రం ‘అభినేత్రి’ (తమిళంలో ‘దేవి’). ఈ సినిమా నటిగా తమన్నాకు మంచి పేరు తీసుకువచ్చింది. కాగా… ఇప్పడు దీనికి సీక్వెల్‌గా ‘అభినేత్రి 2’ (తమిళంలో ‘దేవి 2’) తెరకెక్కింది. తొలి భాగానికి దర్శకత్వం వహించిన ఎ.ఎల్.విజయ్ ఈ సీక్వెల్‌కు కూడా దర్శకత్వం వహించాడు.
తమన్నాకి జోడీగా ప్రభుదేవా నటించిన ఈ హర్రర్ కామెడీ ఫిల్మ్ కార్మికుల దినోత్సవం సందర్భంగా మే 1న విడుదల కానుంది. మరోవైపు ఇదేరోజు… నిఖిల్ హీరోగా టి.ఎన్.సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కిన థ్రిల్లర్ ఫిల్మ్ ‘అర్జున్ సురవరం’ కూడా రిలీజ్ కానుంది. 2016లోనే విడుదలై విజయం సాధించిన తమిళ్ మూవీ ‘కణితన్’కి రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. ఇలా… ఒకే సంవత్సరంలో విడుదలై విజయం సాధించిన చిత్రాలు ఇప్పుడు సీక్వెల్, రీమేక్‌ల రూపంలో ఒకే రోజు విడుదల కానుండడం విశేషమనే చెప్పాలి. మరి… హ్యాపీడేస్
లో కలసి నటించి విజయాన్ని అందుకున్న నిఖిల్, తమన్నా… పోటీగా బరిలోకి దిగుతున్న తరుణంలోనూ విజయాలు అందుకుంటారేమో చూడాలి.
[subscribe]
[youtube_video videoid=m9KgDbO46Ts]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: