మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మళ్లీరావా ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా జెర్సీ. ఈ నెల 19వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో.. ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది చిత్రయూనిట్. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ కు ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ట్రైలర్లో లవ్, ఎమోషన్ సీన్స్ చూపించి సినిమాపై ఇప్పటికే ఉన్న అంచనాలను ఆకాశానికెత్తేశారు. అర్జున్ అనే క్రికెటర్ పాత్రలో నాని ప్రాణం పెట్టి నటించాడన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఎలాంటి కట్స్ లేకుండా క్లీన్ ‘యూ’ సర్టిఫికెట్ ను సొంతం చేసుకుంది.
కాగా ఈ సినిమాలో నాని సరసన కన్నడ నటి శ్రద్ధ శ్రీనాధ్ హీరోయిన్గా నటిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాను సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. క్రికెట్ నేపథ్యంలో వస్తున్న చిత్రం కావడంతో ఈ చిత్రంపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. మరి చూద్దాం నానికి ఈ సినిమా ఎంత వరకూ సక్సెస్ తెచ్చిపెడుతుందో..
[subscribe]
[youtube_video videoid=Rl6T0bM94Qs]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: