చైతు – సామ్ ల కాంబినేషన్ బెస్ట్ ఏది ?

Vote Your Favourite Movie Of Naga Chaitanya and Samantha,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Best Film of Naga Chaitanya and Samantha,Vote For Naga Chaitanya and Samantha Best Movie,Pick One of the Best Movie of Naga Chaitanya and Samantha,Vote For Naga Chaitanya and Samantha Combination Movie
Vote Your Favourite Movie Of Naga Chaitanya and Samantha

సహ నటులుగా పరిచయమై, వెండితెర మీద హీరోహీరోయిన్లుగా అద్భుతమైన కెమిస్ట్రీ పండించి ఆ తరువాత ప్రేమికులుగా మారి ఆపై నిజజీవితంలో భార్యా భర్తలు అయ్యాక కూడా కలిసి నటించి విజయాలను అందుకునే అవకాశం అదృష్టం చాలా కొద్దిమందికే దక్కుతుంది. అలా “ఆన్ స్క్రీన్- ఆఫ్ ద స్క్రీన్” హిట్ పెయిర్స్ చాలా మంది ఉన్నప్పటికీ వారిలో సూపర్ డూపర్ హిట్ పెయిర్ గా చెప్పుకోదగినవారు సూపర్ స్టార్ కృష్ణ – విజయనిర్మల జంట. అది నిన్నటి తరం ముచ్చట.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్


కాగా  ప్రజెంట్ జనరేషన్ లో ముచ్చటైన జంటగా “ఆన్ అండ్ ఆఫ్ ద స్క్రీన్” సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న పెయిర్ “నాగచైతన్య- సమంత”. పెళ్లయిన తరువాత వీళ్లిద్దరూ కలిసి నటించిన తొలి చిత్రం “మజిలీ” ఏప్రిల్ 5న విడుదలై సంచలన విజయాన్ని సాధిస్తుంది. దాదాపు 22 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా తొలి వారాంతానికే 19 కోట్ల పైగా షేర్ రాబట్టి  టార్గెట్ కు అతి చేరువలో ఉంది. అంతేకాకుండా 2019 ప్రారంభం నుండి వరుస పరాజయాలతో తల్లడిల్లుతున్న టాలీవుడ్ కు మజిలీ సక్సెస్ మంచి ఉపశమన విజయం అంటున్నాయి బిజినెస్ వర్గాలు. 


ఇదిలా ఉంటే మజిలీ సక్సెస్ లో దర్శకుడు శివ నిర్వాణ ఇచ్చిన  కంటెంట్ పార్ట్ కు ఎంత క్రెడిట్ దక్కుతుందో పెళ్లయిన తరువాత నాగ చైతన్య- సమంత ల తొలి కాంబినేషన్ అనే క్రేజ్ కు కూడా అంత క్రెడిట్ దక్కుతుంది. ఎందుకంటే సోషల్ మీడియాలో మోస్ట్ టాక్డ్ పెయిర్ గా పాపులర్ అయింది ఈ జంట. కాబట్టి సినిమా బాగుండటంతో పాటు చైతు సామ్ ల కాంబినేషన్ వేల్యూ కూడా తోడవ్వటంతో “మజిలీ” మంచి హిట్ అయింది. అయితే పర్ఫార్మెన్స్ పరంగా  నాగచైతన్య- సమంతలలో ఎవరు బాగా చేశారు అనే చిన్న ఇంట్రెస్టింగ్ డిస్కషన్ కూడా నడుస్తుంది. భార్యాభర్తలుగా డిఫరెంట్ ఎమోషన్స్ , మంచి కాన్ఫ్లిక్ట్ ఉన్న రెండు క్లిష్టమైన పాత్రలో నాగ చైతన్య – సమంత పోటాపోటీగా నటించారు అనే టాక్ బాగా వినిపిస్తుంది. వీరి కాంబినేషన్లో వచ్చిన చిత్రాలు కూడా పెర్ఫార్మెన్స్ పరంగా ఇద్దరికీ మంచి మార్కులు వచ్చాయి.


అలాగే ఇప్పటివరకు ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన నాలుగు సినిమాలలో ఏది బెస్ట్ అని కూడా సరదాగా తేల్చుకుందాం.

సో.. ముందుగా ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు ఏమిటో చూద్దాం.

1) గౌతమ్ మీనన్ దర్శకత్వంలో 2010 ఫిబ్రవరి26 న వచ్చిన ” ఏ మాయ చేసావే” చైతు సామ్ ల కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం.

2) విక్రమ్ కుమార్ దర్శకత్వంలో 2013 మే 23న వచ్చిన” మనం” రెండవ చిత్రం.

3) ఇక వీళ్ల కాంబినేషన్ కు హ్యాట్రిక్ దక్కకుండా 2014 జూన్ 27న వచ్చిన మూడవ చిత్రం “ఆటోనగర్ సూర్య”.

4) శివ నిర్వాణ దర్శకత్వంలో 2019 ఏప్రిల్ 5 న వచ్చిన “మజిలీ” నాలుగవ చిత్రం.

సో… వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఈ నాలుగు చిత్రాల్లో “The Best ” ఏది? 

చైతు - సామ్ ల కాంబినేషన్ బెస్ట్ ఏది ?


ఈ నాలుగు చిత్రాల నేపథ్యంలో  పెర్ఫార్మెన్స్ పరంగా వీరిద్దరిలో” The Best ” ఎవరు ?  


ఇవి ఇవ్వాల్టి  పోల్ గేమ్  పాయింట్స్.


సాధారణంగా ఒక పోల్ గేమ్ ఒక పాయింట్ మీదనే ఉంటుంది. కానీ చైతు- సామ్ లు పాపులర్ హిట్ పెయిర్ కాబట్టి జంట ప్రశ్నలతో ఈ జంట మీద సరదాగా ఒక జంట పోల్ గేమ్ ఆడుకుందాం.సో… వీరిద్దరి కాంబినేషన్ లో బెస్ట్ సినిమా ఏది? వీరిద్దరిలో బెస్ట్ యాక్టర్ ఎవరు?ఇంకెందుకు ఆలస్యం? 

poll and decide The Best

వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఈ నాలుగు చిత్రాల్లో “The Best ” ఏది?

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


[youtube_video videoid=9H3508boKMQ]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here