ఘరానా మొగుడు- బావగారు బాగున్నారా? వీటిలో మీకు నచ్చింది ఏది?

2019 Latest Telugu Movie News, Best Film of Chiranjeevi, Pick One of the Best Movie Of Chiranjeevi, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Vote For Chiranjeevi Best Movie, Vote For Your Favourite Movie of Mega Star Chiranjeevi, Which Mega Hit of Chiranjeevi Is Your Favourite One?

నాలుగు దశాబ్దాల, 150 చిత్రాల నట జీవిత ప్రస్థానంలో మెగాస్టార్ చిరంజీవికి చాలా హిట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఓ రెండు చిత్రాలను పట్టుకొని వీటిలో “ది బెస్ట్” ఏది అని అడగటం ఏమిటి అనుకుంటున్నారు కదూ ? నిజమే ఇంత హఠాత్తుగా…  రెండు సినిమాలను ప్రస్తావిస్తూ ఏది బెస్ట్ అనటం అసందర్భంగా అనిపించవచ్చు. అయితే మా ఈ ప్రశ్నకు ఒక చిన్న సందర్భశుద్ధి ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మెగాస్టార్ కెరీర్ లోని నెంబర్ ఆఫ్ హిట్స్ లో ఘరానా మొగుడు, బావగారు బాగున్నారా చిత్రాలు గొప్ప జ్ఞాపకాలు. అయితే ఈ రెండింటికీ ఉన్న కనెక్టువిటీ ఏంటి అంటే ఈ రెండు చిత్రాలు విడుదలైంది ఈరోజే. అంటే ఏప్రిల్ 9న.
అదేంటి…!?  రెండు చిత్రాలు ఒకే రోజున ఎలా  విడుదల అవుతాయి…? అంటే… వేరు వేరు సంవత్సరాలలో 6  సంవత్సరాల గ్యాప్ లో  విడుదల అయ్యాయి అని అర్థం. 1992 ఏప్రిల్ 9న “ఘరానా మొగుడు”  విడుదలై బాక్సాఫీసును బద్దలు కొట్టగా  , 1998 ఏప్రిల్ 9న ” బావగారు బాగున్నారా?” విడుదలై సంచలన విజయాన్ని సాధించింది. అంటే “ఏప్రిల్ 9”- మెగాస్టార్ కు రెండు మెమరబుల్ హిట్స్ ను అందించిన “మెమరబుల్ డే” గా మెగా హిస్టరీలో నిలిచిపోయింది అన్నమాట. ఈ రెండు సినిమాల విషయంలో మరొక చిన్న ఆసక్తికరమైన విశేషం కూడా ఉంది.

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు దర్శకత్వంలో అగ్రనిర్మాత దేవి వరప్రసాద్ నిర్మించిన” ఘరానా మొగుడు” చిరంజీవి- కీరవాణి ల కాంబినేషన్ లో వచ్చిన తొలి సంగీత సంచలనం.ఇక సొంత బ్యానర్ అంజనా ప్రొడక్షన్స్ లో జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో మెగా ఫ్యామిలీ నిర్మించిన “బావగారు బాగున్నారా” చిత్రానికి  సంగీత దర్శకుడు మణిశర్మ. ఇది కూడా చిరంజీవి మణిశర్మ ల తొలి కాంబినేషన్. ఇలా మెగాస్టార్ తో ఇద్దరు సంగీత దర్శకుల తొలి కాంబినేషన్స్ మ్యూజికల్ హిట్స్ కావడం విశేషం.

ఈ నేపథ్యంలో సరదాగా ఈ రెండు  మెగా హిట్స్ లో   ఏది బెస్ట్ ?  అనే ఒక పోల్ గేమ్ నిర్వహిస్తూ మీ పార్టిసిపేషన్ ను ఆహ్వానిస్తోంది “ద తెలుగు ఫిలింనగర్ డాట్ కాం”. కాబట్టి సరదాగా  ఈ  రెండు మెగా  హిట్స్ లో మీకు నచ్చిన , మీరు మెచ్చిన మెగా హిట్ ఏదో మీరే డిసైడ్ చెయ్యండి.

ఘరానా మొగుడు-బావగారు బాగున్నారా?వీటిలో మీకు నచ్చింది ఏది?

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


[youtube_video videoid=KAAje_60UjE]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here