తెలుగు, తమిళ, హిందీ చిత్ర పరిశ్రమల్లో కథానాయికగా తనదైన ముద్ర వేసింది శృతిహాసన్. ముఖ్యంగా తెలుగునాట ఈ టాలెంటెడ్ బ్యూటీ పలు విజయవంతమైన చిత్రాల్లో సందడి చేసింది. దాదాపుగా ఈతరం అగ్రకథానాయకుల అందరి సరసన మురిపించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… ‘కాటమరాయుడు’ తరువాత మళ్లీ తెలుగు చిత్రాలలో కనిపించని శృతి… తాజాగా ఓ తమిళ చిత్రానికి కమిట్ అయిందని వార్తలు వినిపిస్తున్నాయి.
ఆ వివరాల్లోకి వెళితే… వైవిధ్యభరితమైన చిత్రాలతో ముందుకు సాగుతున్న తమిళ్ హీరో విజయ్ సేతుపతి కథానాయకుడిగా ఎస్. పి. జననాథన్ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ తెరకెక్కనుంది.
‘ త్యాగం’ పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి జోడీగా శృతిహాసన్ నటించే అవకాశం ఉందని కోలీవుడ్ టాక్. నటనకు అవకాశం ఉన్న పాత్ర కావడంతో శృతి కూడా ఈ చిత్రంలో నటించేందుకు ఆసక్తి చూపిస్తోందట.
త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. కాగా… తెలుగులోనూ శృతి సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తోంది. ఆ మధ్య చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమాలో శృతి ఓ కీలక పాత్ర చేసే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. త్వరలోనే శృతి రీ ఎంట్రీ సినిమాలపై క్లారిటీ వస్తుంది.
[youtube_video videoid=rp_KsuIEZqg]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: