యంగ్ టైగర్ యన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్… ప్రస్తుతం భారీ బడ్జెట్ మూవీ `ఆర్ ఆర్ ఆర్`లో కలసి నటిస్తున్న సంగతి తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న ఈ మాసివ్ మల్టీస్టారర్… వచ్చే ఏడాది జూలై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే… నంబర్ వన్ కథానాయకులుగా రాణించిన ఇద్దరు అగ్ర కథానాయకుల (ఎన్టీఆర్, చిరంజీవి) కుటుంబాల నుంచి సినీ వారసత్వం పుచ్చుకున్న తారక్, చరణ్‌కి ఓ లక్కీ డేట్ ఉంది. అదేమిటంటే… ఏప్రిల్ 5. పరాజయాల్లో ఉన్న ఈ ఇద్దరికీ ఈ తేది భలేగా కలిసొచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… `మగధీర` వంటి ఇండస్ట్రీ హిట్‌తో ఫుల్ స్వింగ్‌లో ఉన్న చరణ్‌కి `ఆరెంజ్` రిజల్ట్ స్పీడ్ బ్రేక్ వేస్తే… ఆ తరువాత వచ్చిన `రచ్చ` మళ్ళీ సదరు మెగా హీరోని సక్సెస్ ట్రాక్‌లోకి తీసుకువచ్చింది. 2012లో ఏప్రిల్ 5న విడుదలైన `రచ్చ` చరణ్ కెరీర్‌లో మంచి హిట్ మూవీగా నిలచింది. ఇక తారక్ విషయానికి వస్తే… `అదుర్స్`, `బృందావనం` వంటి వరుస విజయాల తరువాత `శక్తి`, `ఊసరవెల్లి`, `దమ్ము` చిత్రాల ఫలితాలతో నిరాశపడ్డ తారక్ అభిమానులకు విజయానందాన్నిచ్చిన సినిమా `బాద్ షా`. ఈ సినిమా 2013లో ఇదే ఏప్రిల్ 5న తెరపైకి వచ్చింది. అంటే… ఏడాది గ్యాప్‌లో ఒకే తేది అటు చరణ్‌ని, ఇటు తారక్‌ని మళ్ళీ సక్సెస్ ట్రాక్‌లోకి తీసుకువచ్చి… ఆ ఇద్దరు హీరోలకి ఒక లక్కీ డేట్ అయిందన్నమాట.
[youtube_video videoid=YmvQfUoOftE]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: