కింగ్ నాగార్జున కెరీర్‌లో పలు మ్యూజికల్ హిట్స్ ఉన్నాయి. వాటిలో… `నువ్వు వస్తావని` ఒకటి. తమిళ్ బ్లాక్ బస్టర్ మూవీ `తుళ్లాదా మనముమ్ తుళ్ళుమ్` (విజయ్, సిమ్రన్)కి రీమేక్ వెర్షన్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో నాగార్జునకి జోడీగా సిమ్రన్ నటించగా… కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, అలీ, రమా ప్రభ, రఘు కుంచె, వర్ష, తనికెళ్ళ భరణి తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. వి.ఆర్.ప్రతాప్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని సూపర్‌గుడ్ ఫిల్మ్స్ అధినేత ఆర్.బి.చౌదరి నిర్మించాడు. ఎస్.ఎ.రాజ్‌కుమార్ సంగీత సారథ్యంలో రూపొందిన పాటలన్నీ విశేషాదరణ పొందాయి. ముఖ్యంగా… సినిమాలో పలు సందర్భాల్లో వచ్చే `పాటల పల్లకివై` అయితే ఎవర్‌గ్రీన్ సాంగ్‌గా నిలచింది. 2000 ఏప్రిల్ 5న విడుదలైన `నువ్వు వస్తావని`… నేటితో 19 వసంతాలను పూర్తిచేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
`నువ్వు వస్తావని` – కొన్ని విశేషాలు:
* కింగ్ నాగార్జున కెరీర్‌లో చిరస్మరణీయ చిత్రంగా నిలచిన రమణీయ దృశ్యకావ్యం`అన్నమయ్య` (1997) . అయితే… ఆ సినిమా తరువాత నాగ్‌కి ఆశించిన విజయాలు దక్కలేదు. ఈ నేపథ్యంలో… నాగార్జునని మళ్ళీ సక్సెస్ ట్రాక్‌లోకి తీసుకువచ్చిన చిత్రం `నువ్వు వస్తావని`. ఆ తరువాత మళ్ళీ వరుస విజయాలతో దూసుకుపోయాడు నాగ్.
* నాగార్జున, సిమ్రన్ కాంబినేషన్‌లో రెండో చిత్రమిది. ఇదివరకు `ఆటో డ్రైవర్`లో నాగ్‌కి జోడీగా సిమ్రన్ నటించినా… అది రెండో నాయిక పాత్రే. అయితే… `నువ్వు వస్తావని`లో తను ఫుల్ లెన్త్ సోలో హీరోయిన్. దానికి తోడు… సినిమా మొత్తం తన పాత్ర చుట్టే తిరుగుతుంది. అంతేకాదు… ఈ సినిమాలో నాగ్, సిమ్రన్ మధ్య సాగే కెమిస్ట్రీ కూడా మేజర్ ప్లస్ అయ్యింది.
* అటు సూపర్‌గుడ్ ఫిల్మ్స్ బేనర్‌లోనూ… ఇటు ఎస్.ఎ.రాజ్ కుమార్ సంగీతంలోనూ నాగార్జున నటించిన తొలి చిత్రమిది. అలాగే పలువురు నూతన దర్శకులను ప్రోత్సహించిన నాగ్… ఈ చిత్రం ద్వారా వి.ఆర్.ప్రతాప్‌కి దర్శకుడిగా తొలి అవకాశమిచ్చాడు.
[youtube_video videoid=c0frjVPcTKc]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: