సూపర్ హిట్ గమ్యం మూవీ తో దర్శకుడిగా టాలీవుడ్ కు ఎంటరయిన క్రిష్ మొదటి చిత్రానికే బెస్ట్ డైరెక్టర్ గా నంది, ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సొంతం చేసుకున్నారు. క్రిష్ దర్శకత్వం వహించిన వేదం, కృష్ణం వందే జగద్గురుమ్, కంచె, గౌతమి పుత్ర శాతకర్ణి తెలుగు మూవీస్, గబ్బర్ ఈజ్ బ్యాక్ హిందీ మూవీ ఘనవిజయం సాధించాయి. ఎన్టీఆర్ బయోపిక్ రెండు పార్టుల పరాజయం, మణికర్ణిక మూవీ వివాదాలలో చిక్కుకున్న క్రిష్ ఒక కొత్త మూవీ కి స్క్రిప్ట్ రెడీ చేసే పనుల్లో బిజీగా ఉన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సక్సెస్ ఫుల్ రైటర్ బుర్రా సాయి మాధవ్ తో కలసి దర్శకుడు క్రిష్ , తనదైన స్టైల్ లో ఒక అగ్ర కథానాయకుడికి స్టోరీ సిద్ధం చేస్తున్నారు. స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయిన తరువాత ఒక హీరోకి వినిపిస్తారని సమాచారం. త్వరలోనే ఆ హీరో ఎవరనేది తెలుస్తుంది. ముందుగా టాలీవుడ్ లో విజయం సాధించిన తరువాత క్రిష్ బాలీవుడ్ కు వెళతారని సమాచారం.
[youtube_video videoid=LlHI_pFQSOA]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: