ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నందిత శ్వేత ప్రధాన పాత్రలో అక్షర అనే థ్రిల్లర్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. అయితే ఇటీవల ఈ సినిమా నుండి ‘అసురులదర’ అనే పాటను రిలీజ్ చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది కదా. ఇటీవల వచ్చిన పాటలకు కాస్త భిన్నంగా ఉన్న ఈపాట అందరినీ ఆకట్టుకుంది. అయితే ఈ పాటపై తమిళ్ స్టార్ హీరో సూర్య కూడా స్పందించి తన ట్విట్టర్ ద్వారా ప్రశంసలు కురిపించారు. విద్యకు ఉన్న ప్రాముఖ్యతను ఈ పాట ద్వారా చూపించారు.. గుడ్ లక్ అక్షర టీమ్ అంటూ తన ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
#Asuruladara song is about the importance of education! 👍 Good luck to the team!! #Aksharahttps://t.co/oFIe5Uuxiq
— Suriya Sivakumar (@Suriya_offl) April 3, 2019
కాగా చిన్ని కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను హాల్ బ్యానర్ పై అహితేజ బెల్లంకొండ, సురేష్ వర్మ లు కలిసి నిర్మిస్తున్నారు. ఇంకా ఈసినిమాలో షకలక శంకర్, సత్య, మధునందన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాలో నందిత శ్వేత కాలేజ్ లెక్చరర్ గా నటిస్తుంది.
ఈ సినిమాకు కెమెరామాన్: నగేష్ బెనెల్, మ్యూజిక్ డైరెక్టర్ : సురేష్ బొబ్బిలి, ఎడిటర్: జి.సత్య, ఆర్ట్ డైరెక్టర్ : నరేష్ బాబు తిమ్మిరి,కో, ప్రొడ్యూసర్: కె.శ్రీనివాస రెడ్డి, నిర్మాణ సంస్థ: సినిమా హాల్ ఎంటర్ టైన్మెంట్, నిర్మాతలు: సురేష్ వర్మ అల్లూరి, అహితేజ బెల్లంకొండ, రచన, దర్శకత్వం: బి. చిన్నికృష్ణ.
[youtube_video videoid=HCWu246GxOk]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: