కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కురిపించమే కాదు పదికాలాల పాటు అలా గుర్తిండిపోతాయి. ఒకప్పటి సినిమాలకైతే ఇది బాగా వర్తిస్తుంది. ఆనాటి ఎన్టీఆర్, ఏఎన్నార్, సావిత్రి, ఎస్వీ రంగారావు, సూర్యకాంతం, గుమ్మడి, ఛాయాదేవి ఇలా ఉద్దండులెందరో కలిసి నటించిన అద్భుత కావ్యం ‘మయా బజార్’ ఇప్పటికీ మనకి గుర్తొస్తూనే ఉంటుంది…ఇకపై కూడా గుర్తుచేసుకుంటూనే ఉంటాం. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు.. అలా వచ్చి ఇలా వెళ్లిపోయే సినిమాలే తప్ప ప్రేక్షకుల మనసుల్లోకి వెళ్లి.. సహజత్వానికి దగ్గరగా ఉన్న సినిమాలు రావడం చాలా తక్కువ. అలాంటి ఈనాటి పరిస్థితుల మధ్య వచ్చిన ఓ ఆణిముత్యంలాంటి సినిమా రంగస్థలం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ డిజిటల్ యుగంలో 1980 నాటి స్టోరీతో గ్రామీణ రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా గత ఏడాది మార్చి 30 వ తేదీన రిలీజై అందరినీ ఆకట్టుకుంది. గత ఏడాది వచ్చిన ఈ సినిమా ఈ రోజుతో ఏడాది పూర్తి చేసుకుంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రంగస్థలం’ మూవీలో మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ నటన పరంగా విమర్శకుల ప్రశంసల సైతం అందుకున్నాడు. ఓ రకంగా చెప్పాలంటే రంగస్థలం ముందు రంగస్థలం తరువాత రామ్ చరణ్ అని చెప్పొచ్చు. వినికిడి లోపం ఉన్న చిట్టిబాబు పాత్రకి ప్రాణం పోసిమరీ నటించాడు. అతని నుంచి నటన రాబట్టుకోవడంలో దర్శకుడిగా సుకుమార్ సఫలమయ్యాడు. రామ్ చరణ్ తోపాటు ఈ సినిమాలో నటించిన సమంత, ఆది పినిశెట్టి, అనసూయ, జగపతిబాబు, ప్రకాష్ రాజ్, నరేష్ ఇలా ప్రతి పాత్రకి తగిన ప్రాధాన్యతను ఇచ్చాడు సుకుమార్. అలా ఇచ్చాడు కాబట్టే.. సినిమా అంత సక్సెస్ రేట్ ను అందుకోగలిగింది.
ఇక కలెక్షన్ల పరంగా కూడా ఈ సినిమా రికార్డులే క్రియేట్ చేసింది. రూ.200 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌తో పాటు రూ.115 కోట్ల షేర్ రాబట్టి లాభాలు తెచ్చిపెట్టింది ఈ సినిమా. అంతేకాదు మరో విషయంలో కూడా రంగస్థలం రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పటికే ‘రంగస్థలం’ తమిళం, మలయాళంలో డబ్ చేయగా అక్కడ కూడా మంచి కలెక్షన్లు రాబట్టింది. తాజాగా రంగస్థలం సినిమాను కన్నడలో ‘రంగస్థల’ పేరుతో డబ్ చేసి రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి ఇతర భాషల్లో వచ్చిన సినిమాలను కన్నడలో డబ్ చేసి రిలీజ్ చేసే సంప్రదాయానికి ఎప్పుడో బ్రేక్ పడింది. అయితే మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో వేరే భాషల సినిమాలకు కన్నడలో డబ్ చేయాలని అక్కడి నిర్మాతల మండలి తీర్మానం చేయడంతో.. దశాబ్దాల తర్వాత ఇప్పుడు కన్నడలో డబ్ అవుతున్న తెలుగు సినిమాగా ‘రంగస్థలం’ రికార్డు క్రియేట్ చేసింది.
మరి ఇప్పుడున్న జనరేషన్ లో ఇలాంటి సినిమా తీయాలన్న ఆలోచన వచ్చిన సుకుమార్ ముందు ముందు కూడా ఇలాంటి సినిమాలు మరిన్ని తీయాలని కోరుకుందాం. ఇక చిట్టిబాబు పాత్రను చేసిన రామ్ చరణ్ కూడా మూస ధోరణి పాత్రలకు స్వస్తి చెప్పి ఇలాంటి పాత్ర చేయడానికి ధైర్యం చేసినందుకు వినబడేట్టు కాదు.. కనబడేట్టు అభినందనలు తెలుపుదాం.. ఇకముందు కూడా ఇలాంటి ప్రయోగాలు మరెన్నో చేయాలని కోరుకుందాం..
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: