గత కొద్ది కాలంగా వరుస పరాజయాలతో సతమతమవుతున్న నితిన్ ఓ మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. పరాజయాలు ఎదురైనా కూడా ఎక్కడా తగ్గకుండా వరుస సినిమాలు చేస్తూ తన దూకుడును కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇక వెంకీ కుడుముల దర్శకత్వంలో తను భీష్మ సినిమా చేస్తున్నట్టు గతంలోనే చెప్పిన సంగతి తెలసిందే. అంతేకాదు తన పుట్టినరోజు నాటికి మరో రెండు సినిమాలు ప్రకటిస్తానని కూడా కొన్ని రోజుల క్రితమే చెప్పాడు. ఈ నేపథ్యంలో చంద్రశేఖర్ యేలేటితో ఒక సినిమా చేయనున్నట్టుగా ఇటీవలే ప్రకటించాడు. ఇక ఈ రోజు తన పుట్టినరోజు సందర్భంగా ఆయన మరో ప్రాజెక్టును గురించి ప్రకటించాడు. ఇంతకుముందు తనతో ‘ఛల్ మోహన్ రంగా’ చేసిన కృష్ణచైతన్యతోనే మరో సినిమాను కమిట్ అయ్యాడు నితిన్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా..ఇక ఈరోజే ‘భీష్మ’ నుంచి ప్రీ లుక్ ను రిలీజ్ చేశారు. ప్రీ లుక్ పోస్టర్ ను బట్టి .. ఇది యూత్ కి బాగా కనెక్ట్ అయ్యే రొమాంటిక్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. టైటిల్ ను .. పోస్టర్ ను డిజైన్ చేసిన తీరు బాగుంది. ఈ సినిమాలో, నితిన్ డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడనే విషయం ప్రీ లుక్ పోస్టర్ ద్వారా అర్థమవుతోంది.
కాగా ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మికా మందన కథానాయికగా నటిస్తుంది. సితార ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మరి ఈ మూడు సినిమాలు ఈ ఏడాదే వస్తాయా లేదా అన్నది చూడాలి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: