ఒక్క సినిమా హిట్ అయితే చాలు ఆసినిమాలో హీరో, హీరోయిన్లకు ఇండస్ట్రీ నుండి వరుస ఆఫర్లు రావడం సహజమే. అలా తన మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టి వరుస ఆఫర్లు కొట్టేస్తుంది ఆర్ఎక్స్ 100 హీరోయిన్ పాయల్ రాజ్ పుత్. ఆర్ఎక్స్ 100 లో తన బోల్డ్ నటనతో విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకొని మంచి పేరు సంపాదించుకుంది పాయల్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పటికే ఈ భామ విక్టరీ వెంకటేష్, నాగచైతన్య కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ ‘వెంకీ మామ’ సినిమాలో.. వెంకీ సరసన హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఇప్పుడు తాజాగా మరో ఛాన్స్ కొట్టేసినట్టు తెలుస్తోంది. స్టార్ ప్రొడ్యూసర్ సి.కళ్యాణ్ నిర్మించనున్న ఓ సినిమాలో పాయల్ రాజ్ పుత్ నటించనుంది. లేడి ప్రాధాన్యత ఉన్న ఈ సినిమాను రేపు కే.ఎల్ యూనివర్శిటీలో గ్రాండ్ గా లాంచ్ చేయనున్నారు. హ్యాపీ మూవీస్ బ్యానర్ లో నిర్మించనున్న ఈ సినిమాలో నటించే మిగిలిన నటీనటుల వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. మొత్తానికి పాయల్ రాజ్ పుత్ వరుస సినిమాలతో దూసుకుపోతుంది. మరి మొదటి సినిమా అయితే హిట్టయింది.. ఈ సినిమాలు ఎలాంటి సక్సెస్ అందిస్తాయో చూద్దాం..
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: