వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, లౌక్యం, పండగ చేస్కో, నాన్నకు ప్రేమతో, ధృవ, రా రండోయ్ వేడుక చూద్దాం వంటి సూపర్ హిట్ సినిమాలలో నటించిన రకుల్ ప్రీత్ సింగ్ స్పైడర్ మూవీ తరువాత టాలీవుడ్ కు దూరమయ్యారు. హిందీ, తమిళ మూవీస్ లో బిజీగా మారారు. ఎన్టీఆర్ బయోపిక్ మూవీ ఎన్టీఆర్ కథానాయకుడు లో శ్రీదేవి గా అతిథి పాత్రలో నటించి టాలీవుడ్ కు రీఎంట్రీ ఇచ్చారు. రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో బిజీగా మారుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సూపర్ హిట్ మూవీ మన్మథుడు మూవీ కి సీక్వెల్ మన్మథుడు-2 మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరో గా రూపొందనున్న మన్మథుడు-2 మూవీ లో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ ఎంపికయ్యారు. దర్శకుడు రాహుల్ ఈ మూవీ లో హీరోయిన్ క్యారెక్టర్ ను ఒక కొత్త రూపంలో, పెర్ ఫార్మెన్స్ కు స్కోప్ ఉన్న క్యారెక్టర్ ను ప్రేక్షకులకు ఆసక్తి కలిగించేలా రూపొందించారు. ఎటువంటి పరిస్థితి నైనా చక్కదిద్దేలా, ఉత్సాహ వంతురాలైన యువతి గా రకుల్ పాత్ర ఉంటుంది. గుడ్ పెర్ఫార్మర్ గా పేరొందిన రకుల్ మన్మథుడు-2 మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు.
[youtube_video videoid=3Lzbtetf2Gc]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: