అమితాబ్ బచ్చన్… భారతీయ సినీ ప్రియులకు పరిచయం చేయనక్కర్లేని పేరు. నటనకు పర్యాయపదంలా నిలచిన ఈ నటగ్రంథం… ఈ ఏడాదితో 50 వసంతాల సినీ ప్రయాణం పూర్తిచేసుకుంటున్నారు. కేవలం హిందీ చిత్రాలకే పరిమితం కాకుండా… దక్షిణాది తెరపైనా తనదైన సంతకం చేశారాయన. అలాంటి అమితాబ్ కేవలం నటుడిగానే కాదు… గాయకుడిగానూ పలు జనరంజక గీతాలను ఆలపించారు. ఆయన పాడిన కొన్ని పాటలైతే… ఆ యా చిత్రాల విజయాల్లో భాగం కూడా అయ్యాయి. ఇప్పుడు మరోసారి తన గాత్రాన్ని సవరించుకోనున్నారు బిగ్ బి. అయితే… ఈ సారి హిందీ సినిమా కోసం కాదు… హిందీ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతున్న దక్షిణాది చిత్రం కోసం ఆయన పాట పాడారు. ఆ చిత్రమే… `బటర్ ప్లై`.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఐదేళ్ళ క్రితం బాలీవుడ్‌లో ఘనవిజయం సాధించిన `క్వీన్`కి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ కన్నడ చిత్రం కోసం… అమితాబ్ ఓ క్లబ్ సాంగ్ గానం చేశారట. యూట్యూబ్ సెన్సేషన్ విద్యా వోక్స్ తో కలసి బిగ్ బి పాడిన ఈ పాట… సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని సమాచారం. కాగా… `క్వీన్` రీమేక్ తెలుగులో `దటీజ్ మహాలక్ష్మి` పేరుతో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. మరి… తెలుగులోనూ అమితాబ్ పాట ఉంటుందేమో చూడాలి.
[youtube_video videoid=O_zctE5THlA]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: