టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ కూడా మళ్లీ ఫామ్ లోకి వస్తున్నాడు. ఏడాదికి ఒక సినిమాకే ఫిక్స్ అవ్వకుండా రెండు మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే నితిన్ లిస్ట్ లో భీష్మ సినిమా ఉంది. వెంకీ కుడుముల డైరక్షన్ లో సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ నుండి సైట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: ![👇](https://s.w.org/images/core/emoji/11/svg/1f447.svg)
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమాతో పాటు మరో సినిమాకు కూడా నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. రమేష్ వర్మ దర్శకత్వంలో కొత్త సినిమా ఉండబోతుంది. ఏ స్టూడియోస్ బ్యానర్ పై కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు. ఈ సినిమాకు సినిమాటోగ్రఫి నటరాజన్ సుబ్రహ్మణియన్. ఈ సినిమాతో పాటు సూర్యప్రతాప్ డైరక్షన్ లో గీతా-2 బ్యానర్ లో నితిన్ ఓ సినిమా చేయనున్నట్టు సమాచారం.
కాగా ప్రస్తుతం రమేష్ వర్మ బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రాక్షసన్ రీమేక్ చేస్తున్నారు. దాని తరువాత ఈ సినిమా వుండే అవకాశం వుంది. మొత్తానికి నితిన్ ఈ ఏడాది మూడు సినిమాలతో బిజీ బిజీగా గడపబోతున్నాడు. మరి ఈసినిమాలు ఈ ఏడాదే రిలీజ్ అవుతాయా? లేదా? అన్నది తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
[youtube_video videoid=pfL80NKmuDA]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:![👇](https://s.w.org/images/core/emoji/11/svg/1f447.svg)